Amravati Movement: నేటితో ఏడాది పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం, అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన చంద్రబాబు, దుర్గమ్మే అమరావతిని కాపాడాలని తెలిపిన ఏపీ ప్రతిపక్ష నేత
అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు హై టెన్షన్ మధ్య అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని (Amravati Lay Foundation) సందర్శించారు. అక్కడ శిరసు వంచి ఆ ప్రాంతానికి నమస్కరించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
Amravati, Dec 17: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనకు , జై అమరావతి ఉద్యమానికి సరిగ్గా ఏడాది (Amravati Movement) పూర్తయింది.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు హై టెన్షన్ మధ్య అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని (Amravati Lay Foundation) సందర్శించారు. అక్కడ శిరసు వంచి ఆ ప్రాంతానికి నమస్కరించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఈరోజు రాజధాని అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడి లో భారీ బహిరంగ సభకు హాజరు కావడానికి వెళ్లే ముందు చంద్రబాబు (TDP chief Chandrababu Naidu) బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వెళుతుంటే కూడా అవాంతరాలు సృష్టించారని ఆరోపించిన చంద్రబాబు, పసుపు కుంకుమ కూడా తీసుకు రానివ్వకుండా అడ్డుకున్నారు అంటూ మండిపడ్డారు. ఏడాదికాలంగా రాజధాని అమరావతి రైతులు ప్రజా రాజధానిగా అమరావతి నే ఉండాలంటూ పోరాటం చేస్తున్నారని ప్రజా రాజధానికి దుర్గమ్మ రక్షణగా నిలవాలని కోరుకున్నానని చెప్పారు .
Chandrababu Naidu arrives at the Public Meeting
న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులు మహిళలపై దాడులు చేయడం ఆవేదనకు గురి చేసిందన్నారు. అమరావతి రైతులు ఎన్నో అవమానాలను భరించి రాజధాని కోసం పోరాటం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. దేవతల రాజధాని అమరావతిని విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దుర్గమ్మ రాజధాని అమరావతిని కాపాడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఉద్దండరాయునిపాలెం బయల్దేరిన విషయం తెలిసిందే. అయితే, ఉద్దండరాయునిపాలేనికి అనుమతి లేదని మొదట చెప్పిన పోలీసులు.. అనంతరం కొన్ని షరతులతో అక్కడికి వెళ్లడానికి ఆయనకు అనుమతి నిచ్చారు. కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను మాత్రమే అనుమతించారు. దీంతో చంద్రబాబు ఉద్దండరాయునిపాలేనికి వెళ్లి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడి శిలాఫలకాన్ని పరిశీలించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.