TDP-Janasena-BJP Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు..అమిత్ షాతో ముగిసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ.. ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన చేసిన ఎంపీ కనకమేడల..
వీరి భేటీ సుమారు గంట పాటు జరిగింది. మూడు పార్టీల మధ్య లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతోంది.
ఏపీలో త్వరలో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిగా పోటీ దిశగా ఒప్పందం కుదిరింది. శనివారం కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు గంట పాటు జరిగింది. మూడు పార్టీల మధ్య లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతోంది. రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు శనివారం సఫలికృతం అయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరిందని, శనివారం రాత్రి వరకు ఉమ్మడి ప్రకటన ఉంటుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వెల్లడించారు.
బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించగా,పవన్ కళ్యాణ్‌కి చెందిన జనసేన రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 175 స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, టీడీపీకి మొత్తం 145 స్థానాలు దక్కాయి.మిగిలిన 30 సీట్లు బీజేపీ, జనసేనకు దక్కనున్నాయి.
పొత్తు గురించి అధికారికంగా ప్రకటించనప్పటికీ.. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెదేపా ఎంపీ రవీంద్రకుమార్ విలేకరులతో చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయని, విధివిధానాలపై చర్చిస్తున్నామని టీడీపీ ఎంపీ కే రవీంద్ర కుమార్ తెలిపారు.
Times Now-ETG Research Survey: లోక్ సభ ఎన్నికల్లో జగన్ పార్టీ హవా .
చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డా శనివారం సమావేశమై ఎన్నికలకు ముందు ఒప్పందం కుదుర్చుకునేందుకు రెండో విడత చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.