Btech Ravi Arrested: కడపలో అర్ధరాత్రి ఉద్రిక్తత, టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్‌, 14 రోజుల రిమాండ్‌ విధింపు, కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు, ఇంతకీ ఏ కేసులో అరెస్టు చేశారంటే?

గతంలో యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు టీడీపీ నేత నారా లోకేష్ కడప పర్యటనకు వచ్చారు. లోకేష్ పర్యటనలో కడప విమానాశ్రయం వద్ద రవి ఆందోళన చేశారని, పోలీసులకు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

Btech Ravi Arrested (PIC@ X)

Kadapa, NOV 15: మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ బీటెక్ రవికి (B. tech Ravi Arrest) కడప జిల్లా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు కడప జైలుకు (Kadapa Jail) తరలించారు. మొదట రవి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి వెనక్కి పంపించారు. ఇవాళ కడప కోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. 10 నెలల క్రితం ఘటన జరిగితే ఇంత వరకు ఏం చేశారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే రవిపై కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసుతోపాటు టికెట్ బెట్టింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవికి 41ఏ నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు. బెట్టింగ్ కేసును ఇప్పటికిప్పుడు నమోదు చేశారని అటు రవి తరపు న్యాయవాదులు వాధించారు. ఇరు పక్షాల వాదానలు విన్న న్యాయమూర్తి రవికి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను కడప జైలుకు (Kadapa jail) తరలించారు.

 

ఇక బీటెక్ రవిని రాత్రి పోలీసులు అదుపులోకి (B. tech Ravi Arrest) తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు (Pulivendula) వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గన్ మెన్లు, డ్రైవర్ ను వదలేసి రవిని అదుపులోకి తీసుకొని అల్లూరి పీఎస్ కు తరలించారు. అక్కడి నుంచి నేరుగా కడపకు తీసుకెళ్లారు.

HC on Pension: ఏపీలో పెన్షన్ల విధానంపై హైకోర్టు సంచలన తీర్పు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన ధర్మాసనం

కడప రిమ్స్ ఆస్పత్రితో వైద్య పరీక్షల అనంతరం రవిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. గతంలో యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు టీడీపీ నేత నారా లోకేష్ కడప పర్యటనకు వచ్చారు. లోకేష్ పర్యటనలో కడప విమానాశ్రయం వద్ద రవి ఆందోళన చేశారని, పోలీసులకు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. బీటెక్ రవి అరెస్టుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీటెక్ రవి పై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. 324కేసును 333గా మార్చి బెయిల్ రాకుండా చేశారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలను అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. చంద్రబాబునే అరెస్ట్ చేశారు… ఇక తాము భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిన్న ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్, నేడు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్ట్ చేయడం వైసీపీ కుట్రకు నిదర్శనమని అన్నారు. నారా లోకేష్ కడపకు వచ్చిన సమయంలో ఎయిర్ పోర్టులో జరిగిన ఘర్షణ కేసులో బీటెక్ రవిని అరెస్టు చేశామని కడప డీఎస్పీ షరీఫ్ స్పష్టం చేశారు. ఆనాడు తమ ఏఎస్ఐకి గాయాలయ్యాయని తెలిపారు. అరెస్టుకు రవి అందుబాటులో లేకపోవడంతో ఆలస్యమైందన్నారు.