Andhra Pradesh Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు, ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు, ఏకగ్రీవం కానున్న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
ఉండి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామ. వాస్తవానికి చంద్రబాబు కేబినెట్‌లో రఘురామకు చోటు దక్కుతుందని అంతా భావించిన సామాజిక సమీకరణల నేపథ్యంలో చోటు దక్కలేదు.
Hyd, Nov 13: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. ఉండి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామ. వాస్తవానికి చంద్రబాబు కేబినెట్‌లో రఘురామకు చోటు దక్కుతుందని అంతా భావించిన సామాజిక సమీకరణల నేపథ్యంలో చోటు దక్కలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే కానుంది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఒకటి రెండ్రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. పారిశ్రామిక వేత్త అయిన రఘురామ కృష్ణంరాజు...2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ ఎనర్జీ, సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం, వీడియో ఇదిగో..
Here's Tweet:
ఆ తర్వాత ఆ పార్టీ రెబల్ ఎంపీగా మారి జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై రాజద్రోహం కేసు కూడా నమోదుకాగా జైలుకు కూడా వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రఘురామ..ఉండి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేయగా వారిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. తాజాగా డిప్యూటీ స్పీకర్‌గా రఘురామను ఎంపిక చేశారు సీఎం చంద్రబాబు. ఈ పదవి కూడా క్యాబినేట్ ర్యాంక్ తో సమానం.