ఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్‌ ప్లాంట్‌లను రిలయన్స్‌ ఏర్పాటు చేయనుంది. తద్వారా రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది.

తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది, టీడీపీ కూటమిపై మండిపడిన పేర్ని నాని

రిలయన్స్‌ సంస్థతో ఒప్పందం కుదరడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ఇవాళ చాలా ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు. ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. ఒక్కో బయోగ్యాస్‌ ప్లాంట్‌ను రూ.131 కోట్లతో నిర్మిస్తారని చెప్పారు.

Reliance's investment of Rs. 65 thousand crores in Andhra Pradesh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)