Vjy, Nov 11: టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్నినాని మండిపడ్డారు. ఫేక్‌పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదేనని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలతో పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు పేర్నినాని సోమవారం(నవంబర్ 11) మీడియాతో మాట్లాడుతూ..‘డబ్బులిచ్చి పోస్టులు పెట్టే సంస్కృతికి తెరలేపింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఫోటోలతో పోస్టులు పెట్టిన వారిని చంద్రబాబు,పవన్‌కు దమ్ముంటే అరెస్ట్ చేయండి. మీ ఇంట్లో ఆడవాళ్లే ఆడవాళ్లా. ఇలాంటి పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాళ్లు చేసిన తప్పే మనం చేయొద్దు. టీడీపీ,జనసేన,బీజేపీకి చెందిన వాళ్లు తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెట్టండి. వాళ్లు బూతులతో ఫోటోలు పెట్టారని మనం పోస్టులు పెట్టొద్దు. మనం సంస్కారవంతంగా వ్యవహరిద్దాం. పెద్దపెద్ద మాటలు చెప్పే చంద్రబాబు,పవన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా. నాభార్య గురించి ఎన్నో సార్లు యూట్యూబ్ లో తప్పుడు పోస్టులు పెట్టించారు.
Perni Nani Slams TDP
మాజీ సీఎం @ysjagan భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలతో పాటు, నా భార్యపై #TDP సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న అనుచిత పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా..?
మాకు #chandrababu లాగా ఏడుస్తూ నటించడం రాదు.. పోరాడటమే వచ్చు - మాజీ మంత్రి పెర్ని నాని pic.twitter.com/Qcq8J0Yu8g
— Aadhan Telugu (@AadhanTelugu) November 11, 2024
మాకు మీలాగా దొంగ ఏడుపులు ఏడవడం రాదు.భయపెట్టాలనే వందల మందిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇక్కడితో అయిపోతుందని అనుకోవద్దు. నక్కిన శ్యామ్ అనే యువకుడిని చిత్రహింసలకు గురిచేశారు. తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది. మీరు రిటైర్ అయ్యేవరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడనుకుంటున్నారా..? సోషల్ మీడియా పేరుతో పెడుతున్న తప్పుడు కేసులపై పోరాడతాం. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం’అని పేర్నినాని పేర్కొన్నారు.