TDP Office Attack Case: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు

నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

YSRCP Leader, Bapatla Ex MP Nandigam Suresh Arrest

Vjy, Sep 5: అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

బుధవారం నుంచి నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత తన ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించింది.  వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ తనను 2014 నుంచి వేధిస్తోందని నందిగం సురేశ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కాగా, వైసీపీ నేతను పోలీసులు కాసేపట్లో గుంటూరు జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఆయనను తమ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి