KTR Comments Row: దుమారం రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు, వరుస కౌంటర్లతో విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు, ఏపీలో కరెంట్ కోతలు, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ కేటీఆర్ వ్యాఖ్యలు

మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు.

IT Minister kTR (Photo-Twitter)

Amaravati, April 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR Comments Row) అన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు. అలాగే ఏపీలో కరెంటు, నీళ్లు ఇతర వసతులు లేవని (Andhra Pradesh Power Cut and Roads ) ఈ సందర్భాంగా కేటీఆర్ అన్నారు. కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు పండగకు ఏపీ వెళ్లివచ్చారు.

వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు…నాలుగు రోజులు ఉన్నాను….అక్కడ కరెంట్ లేదు,నీళ్లు లేవు,రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్ళను నాలుగు రోజులు బస్సుల్లో ఏపీకి పంపండి…తెలంగాణ సర్కార్ ఏమి చేస్తుందో విలువ తెలుస్తుందని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. నేను చెప్పడం కాదు…మీరు కూడా ఒక సారి ఏపీ వెళ్లి చూసి రండన్నారన్నారు.

తాండూర్‌ సీఐపై అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ కోరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్సైని దూషించిన విషయంలో మహేందర్‌రెడ్డిపై మరో కేసు నమోదు

హైదరాబాద్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పక్క రాష్ట్రం అంటూ సంబోధిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌కు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ విజయవాడకు వచ్చి చూస్తే ఏపీ అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ఏపీలో తాగు, సాగు నీటికి సమస్య లేదన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జోగి రమేష్ వివరించారు.

రెప్పపాటులో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి, పిల్లలకు తీవ్ర గాయాలు, చివ్వెంల మండల పరిధిలో విషాద ఘటన

ఏపీకి వస్తే అమ్మ ఒడి కనిపిస్తుందని.. ఏపీకి వస్తే ఆసరా కనిపిస్తుందని.. 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే పట్టణాల నిర్మాణం కనిపిస్తుందని… ప్రతి గ్రామంలో సచివాలయం కనిపిస్తుందని.. డిజిటల్ లైబ్రరీ కనిపిస్తుందని జోగి రమేష్ అన్నారు. ఇక్కడి సచివాలయాల వ్యవస్థ గురించి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారని జోగి రమేష్ గుర్తుచేశారు. ఒక్క స్టాలిన్ మాత్రమే కాదని.. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్ పాలన గురించి మెచ్చుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు