Telangana Road Accident: విజయవాడ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం, ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, 16 మందికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం
ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ (bus collision) కొట్టాయి. ఈ ప్రమాద ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
Hyd, Jan 12: యాదాద్రి భువనగిరి జిల్లాలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ (bus collision) కొట్టాయి. ఈ ప్రమాద ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 పై ఈ ఘటన జరిగింది.
రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులు మైత్రి ట్రావెల్స్, ఆరంజ్ ట్రావెల్స్ బస్సులుగా నిర్ధారణ అయ్యింది. ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని ప్రాథమిక విచారణ ద్వారా పోలీసులు వెల్లడించారు. పదహారు మందికి (16 persons injured) స్వల్ప గాయాలు కాగా, మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలై విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు.