Andhra Pradesh: హత్యకు గురైన రషీద్ కుటుంబానికి అండగా ఉండేందుకు రేపు వినుకొండకు వెళ్లనున్న వైఎస్ జగన్, ఏపీలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదని మండిపాటు
ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో ఫోన్ మాట్లాడిన వైఎస్ జగన్.. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు
Vjy, July 18: రేపు పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు.నడిరోడ్డు మీద దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో ఫోన్ మాట్లాడిన వైఎస్ జగన్.. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. రేపు తానే స్వయంగా వినుకొండ వస్తానని బ్రహ్మనాయుడికి వైఎస్ జగన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.’’ అని ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్ జగన్ మండిపడ్డారు. నడిరోడ్డుపై ఇంత దారుణంగా నరికి చంపుతారా, వినుకొండ ఘటనపై స్పందించిన వైఎస్ జగన్, ఈ దాడులు ప్రభుత్వానికి సిగ్గుచేటని వెల్లడి
‘‘కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.