Rayalaseema Garjana: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాల్సిందే, రాయలసీమ గర్జనలో దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన సీమ నేతలు, భారీగా తరలివచ్చిన సీమ వాసులు

Rayalaseema Garjana Photo-Twitter/Video Grab)

Kurnool, Dec 5: కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన (Rayalaseema Garjana) మారుమోగింది. అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించారు.మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. రాయలసీమ జిల్లాల నుంచి సభాస్థలికి భారీగా జనం తరలివచ్చారు.శ్రీబాగ్‌ ఒప్పంద ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

ప్రతిరోజు 80వేల మందికి వైకుంఠద్వార దర్శనం, .ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ, అన్ని ఆర్జిత సేవలు రద్దు, రూ. 300 టికెట్‌పై వచ్చేవారి సంఖ్యను కూడా పరిమితం చేస్తూ నిర్ణయం

ఈ గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్‌ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్‌, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ హజరయ్యారు. బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి కూడా రాయలసీమ గర్జనలో పాల్గొన్నారు. వికేంద్రకరణ కోసమే సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం, చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు. స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఆరాటమని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

TTD New Decisions: టీటీడీ సంచలనాత్మక నిర్ణయాలు, ఇక నుంచి తిరుపతిలోనే సర్వదర్శనం టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనం టైమింగ్స్ మార్పు, డిసెంబర్ 01 నుంచి అమల్లోకి కొత్త రూల్స్ 

రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని మంత్రి ఉషశ్రీ చరణ్‌ తెలిపారు. వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు.చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలు ఉండటం దురదృష్టకరం. వికెంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు అని తెలిపారు.

కర్నూల్ లో హైకోర్టు పెట్టడానికి నీకు ఇష్టం ఉందా లేదా చంద్రబాబు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

శతాబ్దాల నుంచి కరువు కాటుకలను ఎదుర్కొన్న ప్రాంతం రాయలసీమని మంత్రి బుగ్గన అన్నారు. కర్నూల్ లో హైకోర్టు పెట్టడానికి నీకు ఇష్టం ఉందా లేదా చంద్రబాబుని సూటిగా ప్రశ్నించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. "వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో 7500 కోట్ల రూపాయల నేషనల్ హైవేలు రాయలసీమకు వచ్చాయి. లా యూనివర్సిటీ రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన మేరకు నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సమానమైన సమతుల్యమైన అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణ జరగాలని" మంత్రి బుగ్గన్న వ్యాఖ్యానించారు.

14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాయలసీమకి ఏమి చేసాడు: మంత్రి పెద్దిరెడ్డి

రాయలసీమ ప్రాంతంలో నుంచి వచ్చిన ముఖ్యమంత్రులతో పాటు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా ఒక్క హైదరాబాద్ తప్ప ఇంకా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని చెప్పి వికేంద్రీకరణ అనే సిద్ధాంతాన్ని సీఎం జగన్ ముందుకు తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. చంద్రబాబును రాయలసీమ ద్రోహగా పరిగణించాలని ప్రజలను పెద్దిరెడ్డి కోరారు.

గడిచిన వెనుకబాటుతనానికి న్యాయ రాజధానితోనే న్యాయం: జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి

"కర్నూలును ఆంధ్రప్రదేశ్‌కు న్యాయ రాజధానిగా చేయాలనే నిర్ణయం ఇప్పటికి అత్యంత అవసరం. పదే పదే ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా పోయింది. ఒకప్పుడు సంపన్న ప్రాంతంగా పేరుగాంచిన ప్రాంతం ఇప్పుడు వెనుకబడిన ప్రాంతంగా నిలిచింది. వ్యవసాయం, పారిశ్రామికీకరణ వంటి రంగాలులో గత ప్రభుత్వలు నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు పెరిగాయి. ఈ సమస్యలన్నింటికీ ముగింపు పలికేందుకు న్యాయ రాజధానిని ఇక్కడే నిర్మించడం సముచితమని" జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి ప్రజలనుద్దేశించి అన్నారు.

‘సీమ’ 1937 పెద్ద మనుషుల ఒప్పందని ఇతర జెఏసీ నేతలు ప్రజలకు వివరించారు.

వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది.

ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మకంతోనే ఆంధ్రరాష్ట్ర సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదుకు తరలించబడింది. శ్రీ బాగ్‌ ఒప్పందం అటకెక్కింది.

దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్‌ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్‌ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని కన్వీనర్ డాక్టర్ సతీష్, పుల్లయ్య రవీంద్ర, కె.వి సుబ్బారెడ్డి, కె. శ్రీనివాస్ రెడ్డి త‌దిత‌ర జెఏసి నాయకులు కోరారు.