Building Collapsed In Visakhapatnam: విశాఖలో కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్, రాత్రి పుట్టినరోజు వేడుకలు చేసుకున్న చిన్నారి మృతి, శిథిలాల కింద 9 మంది ఉన్నారని అంచనా
రామజోగిపేటలో (Ramajogipeta) ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం (Building Collapsed) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిన్నారి మృతదేహం లభ్యమైంది. మరికొంతమంది గాయపడ్డారు.
Visakhapatnam, March 23: విశాఖపట్నంలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో (Ramajogipeta) ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం (Building Collapsed) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిన్నారి మృతదేహం లభ్యమైంది.Andhra Pradesh మరికొంతమంది గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు గాయపడిన వారిని చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ (KGH) ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఆర్డీవో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అటు డీసీపీ గరుడ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఇటీవల కురిసిన వర్షాలకు పురాతన భవనం తడిసింది.రెండు రోజులపాటు కురిసిన వర్షానికి భవనం తడవడంతోనే కూలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు మృతురాలు చిన్నారి అంజలీ బుధవారం పుట్టినరోజు జరుపుకున్నారు. భవనం కూలిపోయే సమయంలో భవనంలో దాదాపు తొమ్మిది ఉన్నట్లు తెలుస్తోంది.