Tirupati By Election: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీనుంచి తప్పుకున్న జనసేన, బీజేపీ అభ్యర్థికి మద్దతు, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక, సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేందుకు అధికార పార్టీ కుస్తీలు

తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

TDP VS YSRCP VS BJP LOGOS (Photo-File Image)

Tirupati, Mar 13: తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక (Tirupati By Election) నేపథ్యంలో రాజీకీయ వాతావారణం వేడిక్కింది. అన్ని పార్టీలు ఎలాగైనా తిరుపతి కోట మీద పాగా వేయాలని పథకాలు రచిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ జనసేన ఇంతవరకు అభ్యర్థిపై క్లారిటీని ఇవ్వలేదు. అయితే తాజాగా అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీలో (BJP to contest by-poll to Tirupati Lok Sabha seat) ఉంటాడని..జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థికి మద్ధతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఇంచార్జీ వి. మురళీధరన్‌ను ప్రకటించారు.

ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన.. ప్రజల కోసం పోరాడేందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ (Bharatiya Janata Party (BJP)అభ్యర్థి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి ఎంపికపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ మంతనాలు జరిపారని, ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థిని తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని ఏకగ్రవంగా నిర్ణయించినట్లు మురళీధరన్ వెల్లడించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నగారా మోగించింది. ప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే తిరుపతి ఎంపీ సీటుకూ ఉప ఎన్నిక నిర్వహిస్తామన్న ఈసీ.. ప్రక్రియ తేదీలను అతి త్వరలోనే ప్రకటించనుంది. ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెండు చోట్ల కౌంటింగ్ నిలిపివేత, రేపు 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు, విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుండగా.. ప్రధాన పార్టీలు పోటీకి సై అంటే సై అంటున్నాయి. సిట్టింగ్ ప్రజాప్రతినిధి మరణిస్తే….ఉప ఎన్నికలో పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాటించడం లేదు. అన్ని పార్టీలూ ఉప ఎన్నికల బరిలో నిలస్తున్నాయి. తిరుపతిలోనూ ఉప ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ అందరికన్నా ముందుగా ఉప ఎన్నిక అభ్యర్ధిని ప్రకటించి షాకిచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు. టీడీపీ అభ్యర్ధిని ప్రకటించిన కొన్ని రోజులకే అధికార వైసీపీ కూడా అనూహ్యంగా ఉప ఎన్నిక బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తిరుపతి టికెట్ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్‌ చక్రవర్తికి వస్తుందని అందరూ భావించారు. సీఎం జగన్‌ కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో బీజేపీ – జనసేన పార్టీలపై దృష్టి నెలకొంది.

విశాఖ ఉక్కుతో నీకేం పని అంటారా ? మేం ముందు భారతీయులమని తెలుసుకోండి, బీజేపీపై మండిపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్, విశాఖ ఉక్కు దీక్షా శిబిరానికి మంత్రిని ఆహ్వానించిన ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు

బీజేపీ తిరుపతి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు బాగా ప్రచారంలో ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాసరి శ్రీనివాసులు అనేక శాఖల్లో విధులు నిర్వర్తించారు. పదవీవిరమణ చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ వర్గాలు ఓ తుది జాబితా సిద్ధం చేయగా, అందులో దాసరి శ్రీనివాసులుకే అత్యధిక అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రేసులో మాజీ మంత్రి రావెల కిశోర్, అఖిల భారత సర్వీసుల మాజీ అధికారి సునీల్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఒకప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా.. వైఎస్ హయాంలో, ఆయన కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసిన మూలింటి మారెప్ప తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తిరుపతి లోక్‌సభ కాంగ్రెస్ కంచుకోట అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయని...ఒకటి రెండు సార్లు కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకటేశ్వర స్వామినే బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలకు తిరుపతి లోక్‌సభ ఓటర్లను ఓటు అడిగే నైతిక హక్కు లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీలో రథయాత్ర చేసేందుకు బీజేపీ నిర్ణయించింది. రథయాత్రను బీజేపీ గతంలోనే ప్రకటించినా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని ఏపీ బీజేపీ ప్రణాళిక రూపొందించింది. ఆలయాలపై దాడులు జరిగిన ప్రాంతాల మీదుగా ఈ రథయాత్ర ఉంటుందని బీజేపీ నేతలు తెలిపారు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now