Tirupati Laddu Controversy: భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి మేము రెడీ, నువ్వు రెడీనా చంద్రబాబు, తిరుమల లడ్డు వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి సవాల్
తిరుమల శ్రీవేంకటేశ్వరసామి లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం (Tirupati Laddu Controversy) రేపుతున్నాయి.
Tirupati, Sep 19: తిరుమల శ్రీవేంకటేశ్వరసామి లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం (Tirupati Laddu Controversy) రేపుతున్నాయి.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌హాల్‌లో నిన్న ఎన్డీయే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పవిత్ర తిరుమల ఆలయాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నాణ్యత లేని పదార్థాలను వాడడమే కాదు.. లడ్డు ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు. ఇది తిరుమలను అపవిత్రం చేసింది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమని పేర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని (YSR Congress denies CM Remarks) అన్నారు. ఈ ప్రపంచంలో పుట్టిన వారెవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి ఆరోపణలు చేయరని, రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతవరకైనా దిగజారుతారని మరోమారు రుజవైందని మండిపడ్డారు. ఈ విషయంలో తాను తన కుటుంబంతో కలిసి భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కూడా అలా చేయడానికి సిద్ధమా? అని సవాలు విసిరారు.