Tirupati Laddu Row: తిరుమలపై చంద్రబాబు చేస్తున్న మహా పాపం అదే, సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిల్
ఈ పిల్ వచ్చే శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం రానుంది
తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ వచ్చే శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం రానుంది. ఈ తరుణంలో తిరుమల లడ్డుపై రాజకీయం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి గతంలో లేనిపోని దుష్ప్రచారం చేశారు. బాబు నియమించిన సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఈ కేసులో దోషులెవరో తేలాలి. ఈ కేసును తేల్చాల్సింది న్యాయస్థానంలోనే. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాదని తెలిపారు.
శ్రీవారి ఆలయంలో భూమన ప్రమాణం వీడియో ఇదిగో, నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతామంటూ..
శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు మాటలను నమ్మొద్దు. ఈ అంశంపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. తన రాజకీయ స్వార్థం కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం చంద్రబాబు చేస్తున్న మహా పాపం. శ్రీవారిపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఓటమి తప్పదు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు. కల్తీ జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ తేలుస్తుంది’ అని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు.