Tirupati Laddu Controversy: సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వివాదం పంచాయితీ, సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్, హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న వైసీపీ

సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు.

Tirumala laddu and Suprem court (Photo-Wikimedia Commons)

Tirumala, Sep 23: ఏపీతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్థించారు.

ఇక తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్‌ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు.

వెంకటేశా.. క్షమించు..! తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో పొగాకు పొట్లం.. వీడియో వైరల్

ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయనున్నామని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారం విచారిస్తామని, ఈలోపు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు