Bomb Threat At ISKCON Temple in Tirupati: తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన
తాజాగా నగరంలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Tirupati, Oct 28: దేవదేవుడు ఆ శ్రీవారు కొలువుదీరిన తిరుపతిలో (Tirupati) వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలోని ఇస్కాన్ ఆలయానికి (Bomb Threat At ISKCON Temple in Tirupati) బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆలయంలో బాబు పెట్టామని దుండగులు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబు స్క్వాడ్స్ తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి పేలుడుకు సంబంధించిన పదార్థాలు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Here's Video:
మూడ్రోజుల్లో నాలుగు బెదిరింపుల హెచ్చరికలు
ఈ నెల 7న తిరుపతిలోని నాలుగు కార్పొరేట్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రెండు రోజుల తర్వాత విదేశీయులే లక్ష్యమంటూ మూడు హోటళ్లకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. అలా మొత్తంగా మూడ్రోజుల వ్యవధిలో నాలుగు బెదిరింపుల హెచ్చరికలు వచ్చాయి. తాజా ఘటనలతో నగరవాసులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.