Tirupati Murder Case: దారుణం..భర్తే భార్యను చంపి పొదలమాటున కాల్చివేశాడు, తిరుపతి సూట్‌కేసులో కాలిన మృతదేహం ఘటనను చేధించిన పోలీసులు, సీసీటీవీ పుటేజీలో విస్తుపోయే వాస్తవాలు

ఈ కేసును (Tirupati Murder Case) సవాల్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ హత్య కేసులో ఆమె భర్తే నిందితుడని పోలీసులు తేల్చారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Tirupati, June 29: ఏపీలోని తిరుపతిలో ఈ నెల 23న సూట్‌కేసులో కాలిన మృతదేహం పోలీసులకు దొరికన సంగతి విదితమే. ఈ కేసును (Tirupati Murder Case) సవాల్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ హత్య కేసులో ఆమె భర్తే నిందితుడని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భర్తే భార్యను చంపి కన్నబిడ్డ కళ్లెదుటే మృతదేహాన్ని కాల్చేసిన దారుణ ఘటనలో (Tirupati, women's murder mystery) నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ పుటేజీలో శ్రీకాంత్‌రెడ్డి.. భార్య భువనేశ్వరి(27)ని హతమార్చి సూట్‌కేసులో మృతదేహాన్ని ఉంచి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. డీబీఆర్‌రోడ్డులోని ఓ అపార్ట్‌ మెంట్‌ నుంచి మృతదేహం ఉన్న సూట్‌ కేసును బయటకు తీసుకురావడం, ట్యాక్సీలోకి ఎక్కించిన దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, ఈ కేసులో నిందితుడు శ్రీకాంత్‌రెడ్డిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుపతికి తరలించారు.

నన్నే వదిలేస్తావా..కోపంతో రూ. 23 లక్షల భాయ్‌ఫ్రెండ్ బైకును పెట్రోలు పోసి తగలబెట్టిన ప్రియురాలు, థాయ్‌లాండ్‌‌లో ఘటన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజ్ వీడియో

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. కడప జిల్లా బద్వేలుకు చెందిన ఎం.శ్రీకాంత్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని (27) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భువనేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. కరోనావైరస్ వల్ల వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో మూడు నెలల కిందట వీరు తిరుపతి వచ్చి... డీబీఆర్‌రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో ఏడాదిన్నర వయసు పాపతో కలిసి ఉంటున్నారు.

పెళ్లయినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి భువనేశ్వరి ఫోన్‌ పని చేయక పోవడంతో పుట్టింటి వారికి అనుమానం వచ్చి శ్రీకాంత్‌రెడ్డిని నిలదీశారు. భువనేశ్వరికి డెల్టాప్లస్‌ వేరియంట్‌ కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు... అక్కడ ఆమె చనిపోవడంతో తనకూ చూపించకుండా దహనక్రియలు చేసినట్లు చెప్పి వారిని నమ్మించాడు. అయితే భువనేశ్వరి అక్క కుమార్తె మమత కర్నూలు జిల్లా లో ట్రైనీ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆమె భువనేశ్వరి ఉన్న అపార్టుమెంట్‌ సీసీ కెమెరా ఫుటేజీలను తిరుపతి పోలీసుల సహకారంతో పరిశీలించారు.

డెడ్‌ బాడీ ముందు డ్యాన్స్‌తో అదరగొట్టిన నందినిరాయ్, జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు స్టెప్పులు, ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఫూటింగ్ మధ్యలో ఘటన, విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

ఈ నెల 22న ఉదయం కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డి ఎర్రటి సూట్‌కేసుతో వచ్చాడు. మధ్యాహ్నం అదే సూట్‌కేసును లాక్కుంటూ.. కుమార్తెను ఎత్తుకుని ట్యాక్సీ ఎక్కిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత అతను రుయా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ సమీపంలోకి వెళ్లినట్లు దారిలోని సీసీ కెమెరా ఫుటేజీల్లో చూసి గుర్తించారు. అక్కడ సమీపంలోని పొదల చాటున సూట్‌కేసును తెరిచి మృతదేహాన్ని కాల్చేశాడు. ఆ సమయంలో అతని భుజంపై కన్నబిడ్డ ఉంది. అలిపిరి పోలీసులు ట్యాక్సీ డ్రైవరును అదుపులోకి తీసుకొని విచారించడంతో అతను ఈ విషయాలను నిర్ధారించాడు.