Tobacco Packet in Tirumala Laddu Prasadam: వెంకటేశా.. క్షమించు..! తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో పొగాకు పొట్లం.. వీడియో వైరల్
పశువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారన్న వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల విషయంలో మరో అపచారం జరిగింది.
Tirumala, Sep 23: వరుస వివాదాలతో ప్రపంచ ప్రసిద్ధ తిరుమల (Tirumala) ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. పశువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారన్న వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల విషయంలో మరో అపచారం జరిగింది. శ్రీవారి లడ్డూ (Tobacco Packet in Tirumala Laddu Prasadam) మహాప్రసాదంలో ఓ పొగాకు పొట్లం కనిపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా గొల్లగుడెంలో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి ఇటీవల తిరుమలకు వెళ్లి వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకొని, తిరుమల లడ్డూను ప్రసాదంగా తీసుకొచ్చారు.
Here's Video:
పొట్లంలో ఏమేం ఉన్నాయంటే?
శ్రీవారి లడ్డూని పంచేందుకు కుటుంబీకులు ఆ ప్యాకెట్ తెరిచి చూడగా.. ఆ లడ్డూలో గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు, పొగాకు పొట్లం కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.