Chandrababu Arrest Update: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబు.. ఖైదీ నెం 7691 కేటాయింపు.. జైల్లో సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతి.. కొనసాగుతున్న ఏపీ బంద్.. పూర్తి వివరాలు ఇవిగో!

ఈ క్రమంలో పోలీసులు ఆయనను ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు.

Chandababu Naidu Credits: X

Vijayawada, Sep 11: స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో (Skill Development Case) అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధినేత చంద్రబాబుకు (Chandrababu) కోర్డు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. టీడీపీ అధినేతకు న్యాయస్థానం ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించింది. ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాన్వాయ్ వెంట రాగా ఆయనను పోలీసులు  జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌జీ భద్రతా సిబ్బంది కూడా ఆయనను అనుసరించారు.

Chandrababu Shifted to Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు, ఏపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 144 సెక్షన్ అమలు, దారి పొడవునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, ఇవాళ బెయిల్ పిటీషన్ పై వాదనలు

ఖైదీ దుస్తులకు బదులు..

ఆదివారం అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్ జైలుకు చేరుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు ఆయనను జైలు అధికారులకు అప్పగించారు. జైల్లో అధికారులు చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించడంతో పాటూ కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు ఇతర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయినందున ఖైదీ దుస్తులకు బదులు సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతించారు. కాగా, చంద్రబాబు నిరసన నేపథ్యంలో నేడు ఏపీ బంద్ కొనసాగుతుంది.

Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం రూపకర్త చంద్రబాబే! ఏపీలో జైలుకెళ్తున్న తొలిమాజీ సీఎం చంద్రబాబే అంటూ సెటైర్లు వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif