Chandrababu in SIT Office (Photo-Video Grab)

Vijayawada, SEP 11: టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu Naidu) పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయనను విజయవాడ నుంచి రాజమండ్రికి తరలించారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబు సొంత కాన్వాయ్‌ లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి (Rajamandry Central Jail) తరలించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై భారీగా పోలీసులు మోహరించారు. టోల్ గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. జాతీయ రహదారిపై లైట్లను ఆర్పివేశారు అధికారులు.

Skill Development Scam: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌, 8 గంటల పాటూ వాదనలు విన్న తర్వాత కూడా ఎటూ తేల్చని న్యాయమూర్తి, ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు 

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court).. చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబును శనివారం నంద్యాలలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు.

Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం రూపకర్త చంద్రబాబే! ఏపీలో జైలుకెళ్తున్న తొలిమాజీ సీఎం చంద్రబాబే అంటూ సెటైర్లు వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి 

చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మధ్యాహ్నానికి వాదనలు పూర్తికాగా, న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు తీర్పు చదివి వినిపించారు. చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంద్రబాబు సహా టీడీపీ శ్రేణులు షాక్ కి గురయ్యారు.