Toor Dal-Sugar in White Ration Card: తెల్ల రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు శుభవార్త.. రేషన్ మీద బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార సరఫరా.. జూలై 1 నుంచి పంపిణీ

మార్కెట్ లో మండిపోతున్న కందిపప్పు, పంచదారను ఇకపై బియ్యంతో పాటు అందించాలని నిర్ణయించింది.

Toor Dal-Sugar (Credits: X)

Vijayawada, June 18: తెల్ల రేషన్ కార్డుదారులకు (White Ration Cards) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhrapradesh Government) శుభవార్త చెప్పింది. మార్కెట్ లో మండిపోతున్న కందిపప్పు (Toor Dal), పంచదారను (Sugar) ఇకపై బియ్యంతో పాటు అందించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కందిపప్పు, పంచదార సేకరణకు చర్యలు తీసుకున్నారు. భారీ మొత్తంలో ఈ నిత్యావసరాలను కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. కాగా బహిరంగ మార్కెట్ లో కిలో మంచిరకం కందిపప్పు రూ. 180, కిలో పంచదార రూ. 50 వరకూ రేటు ఉంది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి సామాన్యులు ఇబ్బంది పడుతుండటం తెలిసిందే.

రాయ్‌బరేలికి జై.. వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ, ఆ సీటు నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి

ఎప్పటి నుంచి అంటే?

జూలై 1 నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను అందించనున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన నిత్యావసరాలను అధికారులు ఇప్పటికే తూకం వేసి పరిశీలించారు.

ప్రకాశం జిల్లాలో జగన్‌కు షాక్, వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, కారణం ఏంటంటే..