IAS Transfers In AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు, ఐదుగురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగింత
బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును (Anantram)నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఆయనకు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ విభాగం అదనపు బాధ్యతలను అప్పగించింది.
Vijayawada, April 29: ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను((IAS Tranfers) బదిలీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును (Anantram)నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఆయనకు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ విభాగం అదనపు బాధ్యతలను అప్పగించింది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా జి. జయలక్ష్మిని నియమించగా రజత్ భార్గవ్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి తప్పించింది. ఆయనను ఎక్సైజ్(Excise) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించి క్రీడలు , సాంస్కృతిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.
మైనారిటీ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు, జి.లక్ష్మీషాకు గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. కొద్దిరోజుల క్రితమే పలువురు డీఎస్పీలకు స్థానచలనం లభించింది. తాజాగా పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.