TTD plans Temple In Jammu: జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు, ముంబై, వారణాసిలో కొలువుతీరనున్న తిరుమల శ్రీనివాసుడు, కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ పాలక మండలి, స్థల కేటాయింపుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్న టీటీడీ ట్రస్ట్ బోర్డ్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని(Lord Venkateswara Temple) జమ్ముకశ్మీర్‌లో(Jammu) నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.
Tirupathi, December 29: తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD chairman YV Subba Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పాలక మండలి (TTD trust board) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని(Lord Venkateswara Temple) జమ్ముకశ్మీర్‌లో(Jammu) నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో (Varanasi)పాటు ముంబైలోనూ(Mumbai) ఆలయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరు చేసింది.
స్థలం కేటాయింపుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయించామని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కథనం ప్రచురించిన ఒక పత్రికపై రూ.100 కోట్లతో క్రిమినల్ పరువు న ష్టం దావా వేసేందుకు నిర్ణయించామని స్పష్టంచేశారు. 2019-20 ఏడాది బడ్జెట్‌ను రూ.3,166.25 కోట్ల నుంచి రూ.3,243.19 కోట్లుగా సవరించింది. బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్‌గా మదన్ మోహన్‌రెడ్డిని నియమించింది. సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం దిశగా కార్యాచరణను రూపొందించింది. గొల్లమండపం మార్చేది లేదని స్పష్టం చేసింది.
టీటీడీ (TTD) గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు(Ramana deekshitulu)ను పాలక మండలి నియమించింది. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది.
జనవరి 6, 7 ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ప్రొటోకాల్ ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుచేయాలని, వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.
తిరుమల ఘాట్ రోడ్డు మరమ్మతులకు రూ.8 కోట్లు, రెండో ఘాట్‌రోడ్డులో రూ.10 కోట్లతో క్రాష్ బ్యారియర్లు, టీటీడీ పరిపాలన భవనం మరమ్మతులకు రూ.14.30 కోట్లు కేటాయించామని, ఘాట్ రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలనకు కమిటీ ఏర్పాటుచేసే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని(Cybersecurity department) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. 2019-20లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2,131కోట్లు అంచనా వేయగా, రూ.1,285 కోట్లు వచ్చిందని, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.270 కోట్లు అంచనా వేయగా, రూ.330 కోట్లు సమకూరిందని తెలిపారు. శ్రీవరాహస్వామి ఆలయంలో గోపురం బంగారం తాపడానికి రూ.14 కోట్లు నిధులు కేటాయించామని పేర్కొన్నారు. టీటీడీలో ప్రత్యేక అకౌంటింగ్ విభాగం ఏర్పాటుకు నిర్ణయించామన్నారు.
ఈ సమావేశంలో బోర్డు సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, జూపల్లి రామేశ్వర్‌రావు, పార్థసారథి, ఎక్స్‌ఆఫిషియో సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సుధా నారాయణమూర్తి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.