Construction Flyover Pillar Collapse: అనకాపల్లిలో కూలిన ఫ్లైఓవర్ పిల్లర్, దంపతుల్దిదరు మృతి, పలువురికి గాయాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు
హైవే వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్ (Under Construction Flyover Pillar Collapse) కూలింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఓ కారు, ట్యాంకర్ ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లర్ భాగాలు వీటి మీద పడటంతో అవి పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదం సమయంలో కారులో ఉన్న దంపతుల్దిదరు మృతి చెందారు.
Anakapalli, July 6: విశాఖ జిల్లాలోని అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైవే వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్ (Under Construction Flyover Pillar Collapse) కూలింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఓ కారు, ట్యాంకర్ ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లర్ భాగాలు వీటి మీద పడటంతో అవి పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదం సమయంలో కారులో ఉన్న దంపతుల్దిదరు మృతి చెందారు.
ట్యాంకర్ లో ఉన్న వారికి గాయాలవడంతో వారిని అనకాపల్లిలోని (Anakapalli in andhra pradesh ) ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్ధంతో కూలడంతో జనం పరుగులు తీశారు. కూలిన బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఈ హైవే విస్తరణ పనులు కొనసాగతున్నాయి. బ్రిడ్జి కింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Here's Under Construction Flyover Pillar Collapse :
బాధితులు నూకాలమ్మ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వంతెన పిల్లర్ కారుపై పడటంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్నది ఇద్దరా? ముగ్గురా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చీకటిపడటంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది.
ప్రమాద ఘటనతో అనకాపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వంతెన సైడ్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో వంతెన నిర్మాణంలో నాణ్యతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణంలో లోపాలే ఈ ప్రమాదానికి కారణమా అన్నది తెలియాల్సి ఉంది.