AP Lockdown 4: యూకే నుంచి విజయవాడకు చేరుకున్న 143మంది ప్రవాసాంధ్రులు, విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు, వందే భారత్ మిషన్ 2లో భాగంగా ఏపీకి రానున్న 13 విమానాలు
ఈ నేపథ్యంలో లండన్ నుండి ప్రవాసాంధ్రులు ముంబై చేరుకుని అక్కడ నుండి ఈ రోజు ఉదయం గన్నవరం విమానశ్రాయానికి (gannavaram airport) చేరుకున్నారు. యూకే ( united kingdom) నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు మొత్తం 156మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.
Amaravati, May 20: కరోనావైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ (Vande Bharat Mission) కింద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో లండన్ నుండి ప్రవాసాంధ్రులు ముంబై చేరుకుని అక్కడ నుండి ఈ రోజు ఉదయం గన్నవరం విమానశ్రాయానికి (gannavaram airport) చేరుకున్నారు. యూకే ( united kingdom) నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు మొత్తం 143మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. కేవలం 64 రోజుల్లోనే లక్ష కోవిడ్-19 కేసులు, అత్యధిక కేసులతో దడ పుట్టిస్తున్న దేశ ఆర్థిక రాజధాని ముంబై, ఇండియాలో లక్షా ఆరువేలు దాటిన కరోనా కేసులు
గన్నవరం విమానాశ్రయంలోనే వీరి అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారిని స్వస్థలాలకు తరలించనున్నారు. వీరంతా 14 రోజులు పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టు వద్ద అధికారులు 9 బస్సులు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఏపీకి తీసుకు రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
Here's Tweet
Here's Vijayawada City Police Tweet
వందే భారత్ మిషన్ 2లో భాగంగా మొత్తం 13 విమానాలు ఏపీకి రాబోతున్నాయని ఏపీ ఎన్‌ఆర్‌టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ చెప్పారు. నిన్న విశాఖ విమానాశ్రయానికి ఫిలిప్పీన్స్, అబుదాబి నుంచి ప్రవాస ఆంధ్రులు చేరుకున్నారన్నారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం సౌదీ అరేబియా జెడ్డా నుంచి 78 మంది గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని తెలిపారు. వందే భారత్ మిషన్ ప్రారంభం, 177 మందితో దేశానికి చేరుకున్న తొలి విమానం, మొత్తం 12 దేశాలకు భారత విమానాలు, రెండు దశల్లో స్వదేశానికి తరలింపు
కువైట్ నుంచి రేపు, ఎల్లుండి 144 మంది గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని మేడపాటి వెంకట్ తెలిపారు. ఆమ్నెస్టీ ద్వారా కువైట్ నుంచి రెండు విమానాల ద్వారా గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని, ప్రవాస ఆంధ్రులు 14 రోజులు క్వారం టైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు.