Vande Bharat Mission: వందే భారత్‌ మిషన్ ప్రారంభం, 177 మందితో దేశానికి చేరుకున్న తొలి విమానం, మొత్తం 12 దేశాలకు భారత విమానాలు, రెండు దశల్లో స్వదేశానికి తరలింపు
Mission Vande Bharat begins (photo-ANI)

New Delhi,May 8: లాక్‌డౌన్‌ ( coronavirus Lockdown) కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌ మిషన్' (Vande Bharat Mission) పేరిట కేంద్రం అతిపెద్ద మిషన్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా మే 7 నుంచి 13 వరకు 64 విమానాల్లో, మూడు యుద్ధ నౌకల్లో 14,800 మందిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. విదేశాల్లో భారతీయులు విలవిల, మే 7 నుంచి దశల వారీగా విమానాలు,నౌకల ద్వారా స్వదేశానికి తరలింపు, 14 రోజులపాటు పేమెంట్‌ ప్రాతిపదికన క్వారంటైన్‌లోకి..

మొత్తం 12 దేశాల నుంచి వారిని తరలించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. కాగా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న తమను ఇండియాకు (India) తీసుకుపోవాలని 3 లక్షల మంది భారతీయ వలస కార్మికులు (Indian Nationals Abroad) ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు.

‘వందే భారత్ మిషన్’లో (Indian missions around the world) భాగంగా తొలి విమానం దేశానికి చేరుకుంది. 177 ప్రయాణికులతో అబుదాబి నుంచి వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చిలో ల్యాండ్ అయింది. వీరిలో 49 మంది గర్భిణులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరందరూ తమ సొంత ఖర్చులతో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అటు సముద్ర సేతు ఆపరేషన్‌లో భాగంగా మాల్దీవుల రాజధాని మాలీ చేరుకున్న తొలి నౌక తిరిగి పయనమైంది. ఇండియన్ నేవీకి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ యుద్ధనౌక 1000 మంది ప్రయాణికులను తీసుకొని శుక్రవారం సాయంత్రానికి కోచి తీరం చేరుకోనుంది. భారత్ ‘ఐఎన్‌ఎస్‌ మగర్‌’ అనే మరో యుద్ధనౌకను కూడా మాలీకి పంపించింది.

Here's ANI Tweet

ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ప్రత్యేక విమానాలు 12 దేశాల నుంచి వారిని తరలించనున్నాయి. యూఏఈ, బ్రిటన్‌, అమెరికా, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను దశల వారీగా ఇండియాకు తీసుకురానున్నారు. . విదేశాల్లోని భారతీయుల కోసం బయలు దేరిన మూడు యుద్ధ నౌకలు, యుఎఈ, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలింపు, వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ

యూఏఈకి పది విమానాలు, అమెరికా, బ్రిటన్‌, మలేషియా, బంగ్లాదేశ్‌కు ఏడు చొప్పున, సౌదీ అరేబియా, కువైట్‌, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌కు ఐదు చొప్పున, ఖతార్‌, ఒమన్‌, బహ్రెయిన్‌కు రెండు చొప్పున విమానాలను పంపనున్నారు. కాగా కేరళ నివాసితులకు గరిష్టంగా 15 విమానాలు, ఢిల్లీ-ఎన్‌సిఆర్, తమిళనాడు వాసుల కోసం 11 విమానాలు, మహారాష్ట్ర, తెలంగాణ వాసుల కోసం ఏడు విమానాలు, గుజరాత్‌కు ఐదు, జమ్మూ కాశ్మీర్, కర్ణాటకకు మూడు, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ వాసుల కోసం ఒక్కొక్కటి చొప్పున విదేశాలకు విమానాలు పంపనున్నారు.

Here's Anurag Srivastava Tweet

యుఎఇ, కువైట్ మరియు సౌదీ అరేబియా వంటి పశ్చిమ ఆసియాలో ఉద్యోగాలు కోల్పోయిన వారితో సహా.. విద్యార్థులు మరియు భారతీయులును తీసుకురానున్నారు. యుఎఇలో 1,50,000 మంది భారతీయులు ఇండియాకు తిరిగి రావడానికి నమోదు చేసుకున్నారు. వీరితో పాటుగా ఇటీవల వీసా రుణమాఫీ ద్వారా లబ్ది పొందిన 45,000 మంది భారతీయులను కువైట్ నుండి తిరిగి తీసుకురానున్నారు.

 Hardeep Singh Puri Tweet

అబుదాబి-కొచి, దుబాయ్‌-కోజికోడ్‌ ప్రత్యేక విమానాలు కేరళకు మొదటగా గురువారం చేరుతాయని యూఏఈలోని భారత రాయబారి పవన్‌ కపూర్‌ తెలిపారు. మే 13 తర్వాత మరిన్ని విమానాల ద్వారా మిగతావారిని తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. రెండో దశ తరలింపులో ప్రైవేటు సంస్థలకు చెందిన విమానాలు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. 67 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా, ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయం మూసివేత, క్వారంటైన్‌లోకి 50 మంది భద్రతా సిబ్బంది

అయితే విమాన ప్రయాణ ఛార్జీలను వారే భరించాలని, నామమాత్రం ఖర్చులు మాత్రమే ఉంటాయని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు తమ రాష్ట్రాలకు చేరిన తరువాత 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, ఆరోగ్యసేతు యాప్‌ను తప్పక డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.

యూఏఈ, మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ‘సముద్ర సేతు’ పేరిట మూడు యుద్ధ నౌకలను పంపినట్లు నావికా దళం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక్కోనౌకలో దాదాపు వెయ్యి మందిని కేరళలోని కొచికి చేరవేస్తామని తెలిపింది. గతంలో ఇరాక్‌-కువైట్‌ మధ్య 1990లో జరిగిన మొదటి గల్ఫ్‌ యుద్ధం సమయంలో కువైట్‌లో చిక్కుకుపోయిన దాదాపు 1.7 లక్షల మంది భారతీయుల్ని విమానాల ద్వారా ప్రభుత్వం స్వదేశానికి తరలించింది.

ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాల నుంచి దాదాపు మూడు లక్షలమంది భారతీయులు స్వదేశానికి రావడానికి పేర్లను నమోదు చేసుకున్నారని సమాచారం. వీరిలో దాదాపు 10 వేల మంది భారతీయులకు కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 84 మంది భారతీయులు కరోనా కారణంగా విదేశాల్లో చనిపోయారు.