Vanijya Utsavam 2021: పారిశ్రామికవేత్తలకు ఏపీ ఆహ్వానం, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఐటీ మంత్రి గౌతం రెడ్డి

అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) సందర్శించారు.

Vanijya Utsavam 2021 (Photo-Video Grab)

Amaravati, Sep 21: ఏపీ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ (Vanijya Utsavam 2021) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్‌ మ్యాప్‌ బ్రోచర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్క్ష్యమని అన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఫార్మా ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌ ఎగుమతులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలిపారు.

వాణిజ్య ఉత్సవం-2021, 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యం

మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ వారంలోనే ఎక్స్‌పోర్టు కాన్‌క్లేవ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్స్‌పోర్టు కాన్‌క్లేవ్‌ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని తెలిపారు. వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోటీ పడే సత్తా ఏపీకి ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం పెంపుకు, మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. కోవిడ్‌ కష్టాలున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపు దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.