Venkatagiri Shocker: నాన్నా లేక కామాంధుడా..మహిళతో అక్రమసంబంధం, ఆమె కూతురిపై ఆరు నెలల నుంచి అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన వెంకటగిరి పోలీసులు, పరారీలో నిందితుడు

తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు.

Representational Image (Photo Credits: File Image)

Venkatagiri, July 21: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం (Venkatagiri Shocker) చోటు చేసుకుంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు. తర్వాత వివాహమై ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం కలిగిన మరో మహిళతో సంబంధం (Man having relatiionship with a woman,) పెట్టుకున్నాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు.

అప్పటి నుంచి ఆ మహిళ, తన ఇద్దరు బిడ్డలు, అంజయ్యతో కలిసి ఉంటోంది. ఆమె కుమార్తెపై కన్నేసిన ఈ కామాంధుడు గత 6 నెలల నుంచి లైంగిక దాడికి (molested her daughter) పాల్పడుతున్నాడు. దీంతో బాలిక తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి బాలికను అత్యాచారం చేసేందుకు అంజయ్య యత్నించాడు. గమనించిన పదేళ్ల కుమారుడు కేకలు వేయగా స్థానికులు ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో గుట్టు రట్టయింది.

సెక్స్ చేస్తే మంచాలు విరిగిపోతాయా..ఒలింపిక్‌ గ్రామంలోని అట్టల మంచాలపై స్పందించిన ఒలింపిక్స్‌ నిర్వాహకులు, యాంటీ సెక్స్‌ బెడ్స్‌ గట్టిగా ఉంటాయని, 200 కిలోల వరకు బరువును మోయగలవని స్పష్టత

అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక మహిళా సంఘం నాయకురాలు మునేశ్వరి, ఐసీడీఎస్‌ సీడీపీవో జ్యోతి, వలంటీర్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటరాజేష్‌ విచారించి కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి మంగళవారం రాత్రి బాధితుల నివాసం వద్దకు స్వయంగా చేరుకొని ఘటనపై ఆరా తీశారు.