Venkatayapalem Head Tonsure Case: 1996 వెంకటాయపాలెం శిరోముండనం కేసు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సహా ఆరు మందికి 18 నెలల జైలు శిక్ష, రూ.2.50లక్షల జరిమానా

ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

Visakhapatnam court

Vjy, April 16: వెంకటాయపాలెంలో సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

దాడి కేసులో మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. నిందితులకు అట్రాసిటీ కేసులో 18 నెలల జైలు శిక్ష విధించింది. ⁠ఒక్కొక్కరికి 42,000 రూపాయల చొప్పున 3,78,000 జరిమానా విధించింది.ఈ కేసులో 28 ఏళ్లపాటు వివిధ కోర్టుల్లో కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరగ్గా.. ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది.  బాలిక ప్రైవేట్ పార్టులో వేలు పెట్టి కామాంధుడు లైంగిక వేధింపులు, హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..

1996లో చంద్రబాబు సీఎంగా ఉండగా డిసెంబర్‌ 29న ఈ ఘటన జరిగింది. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు.భారతీయ శిక్షాస్మృతి 342, 324, 506 లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3 లతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.  13 ఏళ్ళ బాలిక ప్రైవేట్ పార్టులో వేలు పెట్టి కామాంధుడు లైంగిక వేధింపులు, సంచలన తీర్పును వెలువరించిన గౌహతి హైకోర్టు

తీర్పు సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోర్టులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో పోటీపై త్రిమూర్తులకు భారీ ఊరటే లభించింది. ఎందుకంటే.. రెండేళ్లలోపే శిక్ష పడటంతో పోటీకి అడ్డంకులు తొలిగాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ కేసులో బెయిల్ కోసం వ్యక్తిగత పూచీతో పాటు బెయిల్‌కోసం త్రిమూర్తులు దరఖాస్తు చేసుకున్నారు.

1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అనంతరం1995లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది.

2024లో జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆయన మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తొలుత శిక్ష విషయంపై ఆందోళన చెందినా.. కోర్టు 18 నెలల జైలు శిక్ష మాత్రమే విధించడంతో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం త్రిమూర్తులుతో సహా నిందితులందరూ దరఖాస్తు చేసుకున్నారు. నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి వారికి తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేశారు.



సంబంధిత వార్తలు