Vijaya Dairy Chairman Jagan Mohan Reddy: అఖిల ప్రియ రౌడీ రాజకీయానికి భయపడం, చంద్రబాబు మెప్పుకోసమే కొత్త నాటకాలు అని విజయ డైరీ ఛైర్మన్ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపాటు

విజయ డైరీ అన్నది స్వతంత్ర సంస్థ అన్న విషయం కూడా అఖిలప్రియ మర్చిపోయిందన్నారు. అఖిలప్రియ రౌడీ రాజకీ యానికి ఇక్కడ భయప డేవారు లేరు అన్నారు.

Vijaya dairy chairman Jagan Mohan Reddy slams Bhuma Akhila Priya(video grab)

Hyd, Oct 16: నంద్యాల జిల్లా విజయ డైరీలో భూమా అఖిల ప్రియ చేసిన హంగామా పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విజయ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి. విజయ డైరీ అన్నది స్వతంత్ర సంస్థ అన్న విషయం కూడా అఖిలప్రియ మర్చిపోయిందన్నారు. అఖిలప్రియ రౌడీ రాజకీ యానికి ఇక్కడ భయప డేవారు లేరు అన్నారు.

నా సీట్లు కూర్చోవడానికి అఖిలప్రియకు అర్హత లేదు..నేను జిల్లా చైర్మన్ పదవిలో ఉన్నాను ఆమె కేవలం ఎమ్మెల్యే మాత్రమే ఎలా నా సీట్లో కూర్చుంటుందన్నారు. చంద్రబాబు మెప్పు కోసం అఖిలప్రియ కొత్త నాటకాలు చేస్తోంది...తన తమ్ముడి ని డైరీ చైర్మన్ చేసేందుకు నన్ను టార్గెట్ చేసిందన్నారు.

గత నాలుగేళ్లలో విజయ డైరీ ని లాభాల బాట పట్టించిన ఘనత మాది...గతంలో జగత్ పాల డైరీ ఏర్పాటు చేసి విజయ డైరీ నష్టాల పాలవ్వడానికి భూమా కుటుంబమే కారణం అని మండిపడ్డారు. భూమా అఖిల ప్రియ మాట్లా డి నట్లుగా నేను దిగజారి మాట్లాడలేను... దొడ్డిదారిన తన తమ్ముడిని చైర్మన్ చేసేందుకు అఖిలప్రియ కొత్త నాటకానికి తెర లేపిందన్నారు.  ఏపీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు, నెల్లూరును ముంచెత్తిన వానలు

చేతనైతే విజయ డైరీ అభివృ ద్ధికి సహకరించాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించొద్దని సూచిస్తున్నా అన్నారు. తన తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసం విజయ డైరీ ని భూమా అఖిలప్రియ టార్గెట్ చేసింది..గతంలో జగత్ డైరీ వల్ల విజ య డైరీ నష్టాల బాట పట్టింది అన్నది ప్రజలు ఎవరు మర్చిపోలేదు అన్నారు. గత నాలుగు నెలల్లో అఖిలప్రియ చేసిన దారుణాలు అందరికి తెలుసు అని దుయ్యబట్టారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif