IPL Auction 2025 Live

Vijayawada Minor Girl Suicide Case: 14 ఏళ్ల బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, ఆత్మహత్య చేసుకున్న బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ

ఆయనపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Amaravati, Jan 31: ఏపీలో విజయవాడలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారనే ఆరోపణలను (Vijayawada Minor Girl Suicide Case) ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ జైన్‌ను ( TDP leader Vinod Jain) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వినోద్ కుమార్ జైన్ ఉదంతాన్ని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

బెంజ్ సర్కిల్‌ వద్ద గల ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల బాలికను వినోద్‌ జైన్‌ లైంగికంగా వేధించారని, వాటిని తాళ లేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఆ బాలిక రాసిన మూడు పేజీల సూసైడ్‌ నోట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వినోద్‌ జైన్‌ పేరును బాలిక బాలిక ఇందులో ప్రస్తావించింది. అతను ఎలా ఇబ్బందులకు గురి చేశాడనే విషయాన్ని చనిపోయే మందు ఆత్మహత్య లేఖలో రాసింది. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు వినోద్ జైన్‌ను అరెస్ట్ చేశారు. అతను బాలికను లైంగికంగా వేధించాడని పోలీసులు నిర్ధారించారు.

రోడ్డు ప్రమాదంలో పురుషాంగం కోల్పోయిన వ్యక్తికి రూ.17.66 లక్షల పరిహారం, వెంటనే బీమా కంపెనీ చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు

వినోద్ జైన్ గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున పోటీ చేశారు. విజయవాడ 37వ డివిజన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి, ఓడిపోయారు. స్థానిక ఎంపీ కేశినేని నాని, నెట్టెం రఘురామ్‌, విజయవాడకు చెందిన ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు సన్నిహితుడనే పేరుంది. ఆ సాన్నిహిత్యంతోనే కార్పొరేటర్‌గా టికెట్ తెప్పించుకోగలిగాడని పార్టీ నాయకులు చెబుతున్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసిన వెంటనే.. పార్టీ క్రమశిక్షణపరమైన చర్యలను తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నెట్టెం రఘురామ్ తెలిపారు.బాలిక తల్లిదండ్రులను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Here's YSRCP Tweets

ఈ ఘటనపై ఏపీలో ఆగ్రవేశాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ (AP State Women's Commission chairman Vasireddy Padma) అన్నారు. టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్‌ నోట్‌లో రాసిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నేతల పేర్లు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే, ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. బాలిక లేఖ చూసే వరకూ వాస్తవం బయటకు రాలేదని, రెండు నెలలుగా శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టాడన్నారు.

షాకింగ్ న్యూస్..మగాడి పురుషాంగం దగ్గర యోని కూడా ఉంది, అతని కడుపులో అండాశయాలు, గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం, పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు

లైంగిక వేధింపులతో దీక్షిత గౌరి (14) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బాలిక తాత, విశ్రాంత తహసీల్దార్‌ గోవాడ మాంచాలరావు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రెండో కుమార్తె అనురాధ, అల్లుడు గంగాధర కుమార్, వారి పిల్లలు దీక్షిత గౌరి (14), నందశ్రీ విఘ్నేష్‌ (10) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని జీ 25 ఫ్లాట్‌కు ఎదురుగా మరో ఫ్లాట్‌లో ఈయన ఉంటున్నారు. అనురాధ వన్‌టౌన్‌ కొత్తపేటలోని అన్నపూర్ణ మున్సిపల్‌ స్కూల్‌లో ఉపాధ్యాయినిగా, అల్లుడు గంగాధరకుమార్‌ ఎన్‌టీటీపీఎస్‌లో డీఈఈగా పని చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు మాంచాలరావు వాకింగ్‌ చేస్తుండగా ఎవరో ఒక పాప కిందకు దూకిందని అందరూ అనుకుంటుండగా ఆయనా వెళ్లి చూశారు. కిందకు దూకింది తన మనుమరాలు దీక్షిత గౌరి అని గుర్తించారు. ఆయనకు ఏం జరిగిందో అర్థంకాక కుమార్తె ఉంటున్న ఫ్లాట్‌లోకి వెళ్లి దీక్షిత గౌరి గదిలో చూడగా బెడ్‌పై నోట్‌ బుక్‌లో సూసైడ్‌ నోట్‌ కనిపించింది. విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సూసైడ్‌ నోట్‌ను వారికి అందజేశారు.

Here's ANI Updates

టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్​ నోట్​లో పేర్కొందని స్థానిక ఏసీపీ హనుమంతరావు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్​ల కింద కేసులను నమోదు చేసినట్టు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. లైంగిక వేధింపుల వల్లే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిని, అతని కుటుంబ సభ్యుల్ని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టామని పేర్కొన్నారు.

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్​ల కింద కేసులను నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా వినోద్​ జైన్​ ఇంటిని ఇప్పటికే సీజ్​ చేసినట్లు ఏసీపీ తెలిపారు. గత 2 నెలలుగా బాలికను.. వినోద్​జైన్ లైంగికంగా​ వేధించాడని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించిందని అన్నారు. నిందితుడు వినోద్​జైన్.. ఎలాంటి ఇబ్బందులకు గురిచేసేవాడో బాలిక సూసైడ్​ నోట్​లో రాసిందని ఏసీపీ తెలిపారు. బాలిక.. లిఫ్ట్​లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వేధించేవాడని సూసైడ్​ నోట్​లో రాసింది. కాగా, రెండు పేజీల్లో బాలిక తన బాధను తెలియజేసిందని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.