Swarna Palace Fire: పరారీలో రమేష్ ఆస్పత్రి డైరెక్టర్, ఆచూకి తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించిన విజయవాడ నగరపోలీసు కమిషనర్‌, రంగంలోకి దిగిన ఎనిమిది ప్రత్యేక బృందాలు

శ్రీనివాసులు ప్రకటించారు. పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం మీడియాతో కమిషనర్ మాట్లాడారు.

Dr Pothineni Ramesh Babu (Photo-Video grab)

Vijayawada, August 21: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం (Swarna Palace Fire) ఘటన జరిగిన తరువాత పరారీలో ఉన్న ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ రమేష్‌బాబు (Dr Pothineni Ramesh Babu), స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావుల (Mutthavarapu Srinivas Rao) ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని విజయవాడ నగరపోలీసు కమిషనర్‌ బి. శ్రీనివాసులు ప్రకటించారు. పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం మీడియాతో కమిషనర్ మాట్లాడారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కాగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబును అరెస్టు చేయడానికి ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

స్వర్ణ ప్యాలెస్‌లో క్వారంటైన్‌ సెంటర్‌ కాకుండా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ పేరుతో రోగులకు చికిత్స అందించారని, ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను నిర్వహించారని ఆయన అన్నారు. ట్రీట్‌మెంట్‌కు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ప్రమాదం (Vijayawada Swarna Palace Fire) జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికే వారని కమిషనర్ అన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించాం. రమేష్‌ ఆస్పత్రి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించింది, అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి రిపోర్టును అందజేసిన విచారణ కమిటి, రిపోర్టులోని కీ పాయింట్స్ కథనంలో..

స్వర్ణ ప్యాలెస్‌ హోటల్, రమేష్‌ ఆసుపత్రి (Ramesh Hospitals) యాజమాన్యాల మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పలేక పోతున్నారు. 91 సీఆర్‌పీసీ కింద ఆస్పత్రి బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చాం. కేసు విచారణకు ముద్దాయిలు, అనుమానితులు సహకరించడం లేదు. దర్యాప్తునకు సహకరిస్తే వారికే మంచిది. పోలీసులకు అందరూ సమానమేనని విజయవాడ నగరపోలీసు కమిషనర్‌ బి. శ్రీనివాసులు (Vijayawada city commissioner B. Sreenivasulu) తెలిపారు.

ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్, ఆసుపత్రి తాత్కాలిక COVID సంరక్షణ కేంద్రమైన స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిన తరువాత COVID రోగులకు చికిత్స చేయడానికి రమేష్ హాస్పిటల్ యొక్క లైసెన్స్‌ను రద్దు చేశారు. COVID సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆసుపత్రి అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని జిల్లా కలెక్టర్ ఎ. ఎండి ఇంతియాజ్ (collector, A. Md. Imtiaz) తెలిపారు. అలాగే, ఇది మెట్రోపాలిటన్ మరియు ఎం 5 హోటళ్లలోని రోగులకు ఎటువంటి అనుమతి లేకుండా చికిత్స చేస్తూ, వారి నుండి అధిక రుసుము వసూలు చేస్తోందని అన్నారు.