Andhra Pradesh: విశాఖలో రూ.2 వేల నోట్ల మార్పిడి కేసులో విస్తుపోయే నిజాలు,ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

విశాఖపట్నంలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో సూరిబాబు అరెస్ట్‌ అయ్యారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ.90 లక్షలకు సరిపడా రూ.500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్‌ నేవల్‌ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది.

Visakhapatnam cops bust Rs 2,000 note exchange racket

Visakhapatnam, July 7: విశాఖపట్నంలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో సూరిబాబు అరెస్ట్‌ అయ్యారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ.90 లక్షలకు సరిపడా రూ.500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్‌ నేవల్‌ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది. అయితే ఈ ముఠాకు ఏఆర్‌ ఆర్‌ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ ఏఆర్‌ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

అయితే బాధితులు అందించిన రూ. 90 లక్షల్లో స్వర్ణలత రూ. 15 లక్షలు నొక్కేసినట్లు తేలింది. అంతేగాక తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేసింది. తాము మోసపోయామని గ్రహించిన రిటైర్డ్‌ అధికారులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆమెతోపాటు హోంగార్డులు శ్యామ్‌సుందర్ అలియాస్‌ మెహర్‌, శ్రీనుపైనా కేసు నమోదు చేశారు. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా వ్యవహించిన సూరిబాబుపైనా ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

నేను ప్రమాణం చేశాను, నీకు ప్రమాణం చేసే దమ్ముందా, నారా లోకేష్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

బాధితుల నుంచి క్యాష్ కొట్టేయడంలో కానిస్టేబుల్, హోంగార్డ్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఒక పథకం ప్రకారం ఈ దాందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డీజీపీ సీరియస్ అయ్యారు. కాగా నగదు మార్పిడికి మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబు బాధితులను బెదిరించి రూ. 5 లక్షలు కొట్టేసాడు. అలాగే కారులో ఉన్నరూ. 12 లక్షల బ్యాగుతో పరార్ అయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లు శ్రీధర్, హేమ సుందర్‌లు సూరిబాబును అడ్డుకున్నారు. దీంతో తనపై దాడి చేస్తున్నారంటూ ముగ్గురి వ్యక్తులకు ఫోన్ చేసి సూరిబాబు పిలిచించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించారు.

ఈ విషయంపై నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్‌ విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. స్వర్ణలత బెదిరించి డబ్బు తీసుకున్నట్లు రుజువు కావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement