Vizag Coronavirus: మృత్యువుతో పోరాడి ఓడిన పసిపాప, భూమీ మీదకు వచ్చిన 15 నెలలకే కరోనాతో కన్నుమూత, ఆక్సిజన్ అందక విశాఖ కేజీహెచ్‌లో ప్రాణాలు వదిలిన చిన్నారి సన్విత, విషాదంలో తల్లిదండ్రులు

ఆక్సిజన్‌ అందక, ఊపిరి కోసం ఎదురు చూసి, చూసి మరీ ఓ చిన్నారి (One-and-Half-Year-Old Baby Dies of COVID-19) కన్నుమూసింది. విశాఖపట్నం కేజీహెచ్‌లోని (King George Hospital) కొవిడ్‌ వార్డు బయటే ఈ విషాదం చోటు చేసుకుంది.

Premature Baby- Representational image Only | (Photo Credits; Pixabay)

Visakhapatnam, April 28: విశాఖపట్నం కేజీహెచ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ అందక, ఊపిరి కోసం ఎదురు చూసి, చూసి మరీ ఓ చిన్నారి (One-and-Half-Year-Old Baby Dies of COVID-19) కన్నుమూసింది. విశాఖపట్నం కేజీహెచ్‌లోని (King George Hospital) కొవిడ్‌ వార్డు బయటే ఈ విషాదం చోటు చేసుకుంది. పాపకు ఊపిరి అందడంలేదు. బెడ్‌ కేటాయించండని తల్లిదండ్రులు గంటపాటు అక్కడున్న సిబ్బందిని బతిమిలాడినప్పటికీ వారి ఆవేదన అరణ్య రోదనే అయింది.

విషాద ఘటన వివరాల్లోకెళితే.. అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామానికి చెందిన ఇల్లా పైడిరాజు కుమారుడు వీరబాబు చెన్నైలో సీఐఎస్ఎఫ్‌లో జవానుగా పనిచేస్తున్నారు. పదిహేను రోజుల క్రితం సెలవుపై భార్య ఉమ, ఏడాదిన్నర కుమార్తె సన్వితతో స్వగ్రామానికి వచ్చారు.

గత శుక్రవారం పాప అస్వస్థతకు గురికావడంతో అచ్యుతాపురంలో చిన్నపిల్లల ఆస్పత్రిలో చూపించారు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందంటూ అక్కడి వైద్యులు గాజువాకలోని సన్‌రైజ్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడి వైద్యులు సోమవారం వరకు చికిత్స చేశారు. అయితే మంగళవారం ఉదయం పాప పరిస్థితి బాగాలేదని, వెంటనే విశాఖలో మరో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అక్కడ పరీక్షలు చేయగా... ఏడాదిన్నర వయసున్న ఆ చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

లాక్‌డౌన్ మీద జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు, లాక్‌డౌన్ విధిస్తే ప్రభుత్వానికి రూ.1 నష్టం జరిగితే, ప్రజలకు రూ.4 నష్టం జరుగుతుంది, గతేడాది ప్రభుత్వానికి రూ.20,000 కోట్ల నష్టం, ప్రజలకు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపిన ఏపీ సీఎం

ఈ నేపథ్యంలో తాము కరోనాకు చికిత్స చేయలేమంటూ ఎక్కడికైనా తీసుకువెళ్లాలని ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో... తల్లిదండ్రులు అంబులెన్స్‌లో చిన్నారిని కేజీహెచ్‌లోని సీఎస్ఆర్ బ్లాక్‌లోగల కొవిడ్‌ వార్డుకు తీసుకువచ్చారు. అప్పటికే శ్వాస తీసుకునేందుకు చిన్నారి ఇబ్బందిపడుతుండడంతో అంబులెన్స్‌లోనే ఉన్న ఆక్సిజన్‌ను అందించారు. సుమారు గంటపాటు అంబులెన్స్‌లో ఉన్న సిలిండర్‌ ద్వారా పంపింగ్‌ చేసి చిన్నారికి ఆక్సిజన్‌ అందించారు.

చివరికి చిన్నారి సన్విత అంబులెన్స్‌లోనే చనిపోయింది. కళ్ల ముందే తమ బిడ్డ మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మూడు రోజుల పాటు వైద్యం చేసి అక్కడ (గాజువాకలో) లక్షా 30 వేల రూపాయలు బిల్లు వేశారు. చివరి నిమిషంలో మా బిడ్డను పంపించేశారు. ఇక్కడకు వస్తే కనీసం బెడ్‌ (After Wait For Hospital Bed) కూడా కేటాయించలేదు’’ అంటూ విలపించారు.

తల్లుల ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన నగదు, 2021 ఏడాదికి గానూ రూ.1,048.94 కోట్లను జమ చేయనున్న ఏపీ సర్కారు, బడ్జెట్‌ను విడుదల చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు

ఈ ఘటనపై కేజీహెచ్‌ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 3.40 గంటలకు అంబులెన్స్‌లో చిన్నారిని తీసుకొచ్చారు. 4 గంటలకు ట్రయాజ్‌లోకి తీసుకువెళ్లాం. అక్కడ జనరల్‌ ఫిజీషియన్‌తోపాటు పీడియాట్రిక్‌ వైద్య నిపుణుడు పరీక్షించారు. కొవిడ్‌ వల్ల వచ్చిన వైరల్‌ న్యుమోనియాతో బాధపడుతున్న చిన్నారి ఊపిరితిత్తులు అప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. చికిత్స ప్రారంభించిన కొద్దిక్షణాలకే మృతిచెందిందని కేజీహెచ్‌ అధికారులు తెలిపారు.