Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసు, సునీత ముసుగు నేటితో తొలగిపోయిందంటూ కౌంటర్ విసిరిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా ఏమన్నారంటే..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని ప్రశ్నించారు
వివేకా కేసుపై సునీత చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌటంర్ ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి ఆనాడు పూర్తి మెజార్టీ ఉంది. విజయమ్మను ఓడించాలనుకుని వివేకాను దగ్గరకు తీసుకున్నారు.
అసలు వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరు?.. చంద్రబాబు, బీటెక్ రవి కాదా?.. అలాంటి వ్యక్తులతో సునీత ఇప్పుడు ఎలా జట్టు కట్టారు?. సునీత ఈరోజు ముసుగు తీసేసింది. ఆమె ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయింది. ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే విషయం అందరికీ అర్థమవుతుంది. సునీత వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. ఆమె మాటలకు తలా తోకా లేదు. సునీత మాటల వెనుక కుట్ర ఉంది. ఆమె వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. చంద్రబాబు చేతిలో సునీత ఓ పావులా మారారు.
వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే. నాలుగైదు రోజుల్లో తేలిపోవాల్సిన కేసు అని సునీతే అంటున్నారు. మరి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును సునీత అడగాలి కదా!. తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకోలేదా..?. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే. వివేకా కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు ఉన్నాయి. విచారణ అన్నింటిపైనా జరుగుతుంది.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గుండాలు, స్మగ్లర్లు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళని చంద్రబాబు తన పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారు?. 24 సీట్లను పవన్ 240 సీట్లు అనుకుంటున్నట్టున్నాడు. తాడేపల్లి గూడెం సభ అట్టర్ ప్లాప్. తొలి సమావేశం తోనే టీడీపీ, జనసేన పొత్తు ఫెయిల్ అని తేలిపోయింది. కాపు నాయకులకే అర్థమైపోయింది పవన్ అందరిని మోసం చేశాడని. పోటీకి అభ్యర్థులు లేని పవన్ కల్యాణ్ ఎవరిని అధఃపాతాళానికి తొక్కుతాడు?. పదేళ్ల కిందట పార్టీ పెట్టిన పవన్ అసలేం సాధించారు’’ అని సజ్జల ప్రశ్నించారు.