Kadapa, July 23: వైయస్ వివేకానంద హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా కేసులో జరుగుతున్న విచారణపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్‌కు (CBI Director) ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ (Avinash reddy letter) రాశారు. వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్‌సింగ్ పై (Sp Ram singh) ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో రామ్‌సింగ్ దర్యాప్తు చేశారని అవినాష్ ఆరోపించారు. రామ్‌సింగ్ చేసిన దర్యాప్తు తీరుని సమీక్షించాలని సీబీఐ డైరక్టర్ ను కోరారు అవినాష్‌రెడ్డి. సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్‌షీట్ల ఆధారంగా లేఖ రాశారు అవినాష్. వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్ అంశాలను లేఖలో ప్రస్తావించారు.
దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్ సింగ్ విచారణ జరిపారని అవినాష్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. రెండో భార్య పేరిట ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదని ఎంపీ తెలిపారు.
మున్నా లాకర్‌లో నగదకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు అవినాష్‌రెడ్డి. విచారణలో రామ్‌సింగ్ చేసిన తప్పులని సవరించాలని కోరారు అవినాష్. నిజమైన నేరస్తుల్ని పట్టుకొని న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టర్‌ని కోరారు అవినాష్.