GVMC Standing Committee Elections: గ్రేటర్ విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం
ఈ ఎన్నికల్లో కూటమి (NDA) ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థులే గెలుపొందారు. కూటమి కార్పొరేటర్లు 60 ఓట్లు సాధించారు.
Vizag, AUG 07: విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ (GVMC Standing Committee Elections) ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి (NDA) ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థులే గెలుపొందారు. కూటమి కార్పొరేటర్లు 60 ఓట్లు సాధించారు. కాగా, చెల్లని ఓట్లు ఉన్నా.. వాటిని తొలగించకుండా ఓట్లు లెక్కించారని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని వైసీపీ (YSRCP) కార్పొరేటర్లు చెప్పారు. ఇక, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో దీని ప్రభావం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి విజయంపై ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించారు.
త్వరలో జరిగే ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికలోనూ కూటమిదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ”వైసీపీ సొంత పార్టీ కార్పొరేటర్లలో ఉన్న వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపించింది. ఈ వ్యతిరేకత గురించి గతంలో నేను చెప్పాను. ఇప్పుడు మీకు కనిపించింది. మా మీద ప్రజలు, కార్పొరేటర్లు ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్తాం. భవిష్యత్తులో మేయర్ స్థానాన్ని కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది. ప్రజా తీర్పులో భాగంగా త్వరలో జరిగే ఎన్నికల్లో కూటమిదే విజయం. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం తధ్యం” అని ఎమ్మెల్యే వంశీకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.