Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటన
వారిని ఓదార్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు సీఎం జగన్. నేరుగా విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వారిని పరామర్శించనున్నారు. ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్నారు.
విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఓ ప్యాసింజర్ రైలు.. ఆగి ఉన్న మరో ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది చెందారు. వందల మందికి పైగా గాయాలయ్యాయి.
విజయనగరం రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారిని ఓదార్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు సీఎం జగన్. నేరుగా విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వారిని పరామర్శించనున్నారు. ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్నారు.
సోమవారం కంటకాపల్లి ప్రమాద ఘటన స్థలం పరిశీలన పర్యటనను సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించనున్నారు.
ఘోర రైలు ప్రమాదం ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. అలాగే సీఎం జగన్ సూచనతో మంత్రి బొత్స ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం ప్రకటన కూడా చేశారు సీఎం జగన్.
Here's CMO AP Tweet
రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఘటన నుంచి సీఎం జగన్‌ను ఫోన్ చేసి ఆరా తీసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.