Vizianagaram Train Accident: రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించిన సీఎం జగన్, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి

తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆ‍యన పరిశీలించారు.

andhra-pradesh-cm-ys-jagan-mohan-reddy-visit Who meet-injured in Accident

విజయనగరం కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆ‍యన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపై చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.

షెడ్యూల్‌ ప్రకారం ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు.​ ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు.

విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటన

గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆపై విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల్ని పరామర్శించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif