Independence Day 2023: మేనిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామని తెలిపిన సీఎం జగన్, పేదలు గెలిచి వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం జరుగుతుందని వెల్లడి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్‌. అనంతరం ప్రసంగించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

CM Jagan Mohan Reddy in Independence Day Celebrations (Photo-AP CMO)

VJY, August 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్‌. అనంతరం ప్రసంగించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు 68 శాతం మంత్రి పదవులు కల్పించినట్లు వెల్లడించారు.శాసన సభ స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీని నియమించినట్లు చెప్పారు. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాల పాలన అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 99.05శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. 50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి చేరుకగా.. 2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. పంట నష్టపోతే ఆ సీజన్‌లో పరిహారం అందిస్తున్నామన్నారు. ఆక్వా జోన్లలో ఉన్న రైతులకు రూపాయిన్నరకే విద్యుత్‌ ఇస్తున్నమని చెప్పారు. పాల రైతుల కోసం పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చామని.. పాల ధర లీటర్‌కు రూ. 10 నుంచి రూ. 22 వరకు పెంచినట్లు తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభమైనట్లు సీఎం తెలిపారు. భోగాపురం అంతార్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరసగా మూడేళ్లు ఏపీనే నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రానికి రూ. 67,196 కోట్ల పెట్టుబడులు రాగా.. కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రూ. 13.42 లక్షల కోట్లకు ఎంవోయూలు చేసుకున్నామని, కొత్తగా ప్రారంభమైన ఎంఎఎస్‌ఎంఈ యూనిట్లు 2,00,995 అని చెప్పారు.

విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు

విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మారగా.. గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగీష్‌ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ విధానం.. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నామన్నారు. భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన అందిస్తున్నామని.. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అమలు చేస్తున్నామని చెప్పారు. డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్‌ పోస్టుల భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.

పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమేనన్నారు సీఎం జగన్‌. పేదలు ఇంగ్లీష్‌ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే, పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే, పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే, పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమే, పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధంనని స్పష్టం చేశారు.

వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ చేసినట్లు వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నామని, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు చేసినట్లు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించిందని.. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని చెప్పారు. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు తెచ్చామని.. పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చామన్నారు సీఎం జగన్‌. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నామన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని.. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని, అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నామని తెలిపారు.

వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. 2025 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. వెలిగొండలో మొదటి టన్నెల్‌ పూర్తి చేశామని.. రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. సామాజిక న్యాయం నినాదం కాదు.. దాన్ని అమలు చేసి చూపామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిచినట్లు చెప్పారు.

అర్హులందరికీ పథకాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నామని.. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందిస్తూ, రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని.. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 98.5 శాతం వాగ్దానాలను అమలు చేశామన్నారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామని తెలిపారు. మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశామని అన్నారు. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టామని చెప్పారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now