YS Jagan's Security Row: భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని రీప్లేస్ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం
మధ్యాహ్నాం తిరిగి వాదనల సమయంలో అడ్వొకేట్ జనరల్ వివరణ ఇస్తూ.. ‘‘స్పేర్ పార్ట్స్ కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు.
Vjy, August 7: తన భద్రతా కుదింపుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది.జగన్ భద్రత విషయంలో రాజీ పడొద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్నాం తిరిగి వాదనల సమయంలో అడ్వొకేట్ జనరల్ వివరణ ఇస్తూ.. ‘‘స్పేర్ పార్ట్స్ కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు.
కాబట్టి ఆయన కోసం మరొక వాహనాన్ని ఏర్పాటు చేస్తాం. ఎక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంటుందో గుర్తించి.. అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం రీప్లేస్ చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కండిషన్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు ఇస్తామంది. జగన్ భద్రతా సిబ్బంది సమాచారం ఇస్తే జామర్ ఇస్తామని స్పష్టం చేసింది. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం, ఏపీ క్యాబినెట్ సమావేశం హైలెట్స్ ఇవిగో..
దీంతో రెండు వారాల్లో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించిన న్యాయస్థానం.. మూడు వారాల్లో పిటిషనర్‌ను కూడా రీజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది.తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. అంతకు ముందు ఈ ఉదయం విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాన మంత్రులకు ముఖ్యమంత్రులకు ఏ విధమైన భద్రత కల్పిస్తారో అదే విధంగా మాజీ సీఎం అయిన జగన్‌కు భద్రత కల్పించేట్టు చూడాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు.