Rain Alert to AP: ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Rains (Photo-Twitter)

Vijayawada, Oct 11: దక్షిణ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణం చేత వచ్చే సోమవారం నుంచి ఏపీలో (Andhrapradesh) మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 17 నాటికి ఏపీలోనే ఈ వాయుగుండం తీరం దాటవచ్చని అంచనా వేశారు. అటు రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు పడొచ్చని తెలిపారు.

ముగిసిన పారిశ్రామిక దిగ్గ‌జం అంత్య‌క్రియ‌లు, పార్సి సాంప్ర‌దాయం ప్రకార‌మే కానీ..నూత‌న ప‌ద్ద‌తిలో అంత్య‌క్రియ‌ల నిర్వ‌హ‌ణ‌

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

పల్నాడు, శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో నేడు పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

ఆ ఒక్క కారణమే రతన్ టాటా పెళ్లికి అడ్డుగా నిలిచింది, ఆయన ఆస్తుల విలువ 3 వేల 800 కోట్ల రూపాయల పై మాటే.. ఆసక్తికర విషయాలు మీకోసం..