Weather Forecast: ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు, రేపు చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, తెలంగాణలో కూడా రెండు రోజుల పాటు భారీ వర్షాలు

రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది.

Rains (Photo Credits: PTI)

Amaravati, July 18: ఏపీలో మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని (Weather Forecast) అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, గుణా, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని, అల్పపీడనం రాయ్ పూర్, పరదీప్ మీదుగా పయనించి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వీటి ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు ( Modarate rainfall) కురుస్తాయని పేర్కొంది. రేపు చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. కాగా, ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పడమర దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపింది.

ఇక తెలంగాణను ఇంకా వర్షాల ముప్పు (Weather Update) వీడడం లేదు. నేడు భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని (Moderate rainfall in next two days) వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూమి ఉపరితలంపైకి వచ్చింది. సాయంత్రానికి ఒడిశా తీరంపై కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు భారీగా, రేపు ఓ మోస్తరుగా వర్షాలు (Telangana Rains) కురుస్తాయని అధికారులు తెలిపారు.



సంబంధిత వార్తలు

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ