Weather Forecast: పిడుగులు పడే అవకాశం, ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు, వర్షం పడే సమయంలో బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.
బుధ, గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. పిడుగులు పడే ప్రమాదమూ ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే, నేటి నుంచి శుక్రవారం వరకు అంటే మరో మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, వర్షం పడే సమయంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది.