Andhra Pradesh: అమరావతి నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ, శ్రీసిటీలో 15 కంపెనీలు ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.

World Bank and ADB delegation meet Andhra Pradesh CM Chandrababu Naidu, discusses Amaravati Development Funding

Vjy, August 20: ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి విదితమే. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.

అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ రుణం సమకూర్చనుంది. రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈనెల 27 వరకు అమరావతిలో పర్యటించనున్నారు. పురపాలకశాఖ మంత్రి నారాయణతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఉద్రిక్తత, పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు దాడి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి బయటకు పంపించిన పోలీసులు

వివిధ పరిశ్రమలకు వేదికగా ఉన్న శ్రీసిటీ నుంచి తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వైపుగా పారిశ్రామిక రంగం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఇప్పుడు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో సోమవారం వివిధ పరిశ్రమలకు చంద్రబాబు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు.

Here's CM Tweets

శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించి మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు ఫైర్‌ స్టేషన్‌ను ప్రారంభించి, పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్‌ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో సమావే­శమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులపై చర్చించారు.

దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్‌, ఇజ్రాయిల్‌కు చెందిన నియోలింక్‌, జపాన్‌కు చెందిన నైడిక్‌, ఓజెఐ ఇండియా ప్యాకేజ్‌, జర్మనీకి చెందిన బెల్‌ పరిశ్రమలతో పాటు భారతదేశానికి చెందిన అడ్మైర్‌, ఆటోడేటా, బాంబేకోటెడ్‌ స్పెషల్‌ స్టీల్స్‌, ఈప్యాక్‌, ఇఎస్‌ఎస్‌కెఏవై, ఎవర్‌షైన్‌, జేజీఐ, త్రినాత్, జెన్‌లెనిన్‌ సంస్థల కార్యాకలాపాల‌కు చంద్ర‌బాబు నేడు శ్రీకారం చుట్టారు.. రూ. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ల‌భించాయ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.  ఏపీలో 15 శాఖల్లో బదిలీలు, గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం, 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి

చైనాకు చెందిన ఎన్‌జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్‌, జపాన్‌కు చెందిన ఏజీ ఆండ్‌ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఇదే సంద‌ర్భంగా జపాన్‌కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఇ, సింగపూర్‌లతో పాటు భారతదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకున్నారు. వాటి పెట్టుబ‌డుల‌ విలువ 1,213కోట్ల రూపాయలుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అనంతరం శ్రీసిటీలోని బిజినెస్‌ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో జరిగిన సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల‌ను వివ‌రించారు.. ఎపి పారిశ్రామిక విధానాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు

‘ఈరోజు ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయం. శ్రీసిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. శ్రీసిటీలో 4.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సాధించడం, 4 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించడం గొప్ప విషయం. శ్రీసిటీని స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంపద, సృష్టి.. సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది.

చెన్నై, కృష్ణపట్నం, తిరుపతికి శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్‌ జో¯Œన్‌గా తీర్చిదిద్దాలనేదే నా ఆలోచన. నేను 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించాను. అప్పట్లోనే విజన్‌ 2020కి రూపకల్పన చేసి అమలు చేశా. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించా. భారత్‌ను ఐటీ ప్రపంచపటంలో నిలిచేలా చేస్తుందని ఆనాడే చెప్పా. ఈరోజు దాని ఫలితాలు అందరూ చూస్తున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి.జి.భరత్, వంగలపూడి అనిత, డీజీపీ, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. రాష్ట్రంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామన్నారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని తెలిపారు. సోమశిల ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేలా దాని పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమశిల జలాశయం 1988–89లోనే అప్పటి సీఎం ఎన్‌టీ రామారావు 75 టీఎంసీలు చేశారని చంద్రబాబు మాట్లాడడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. వైఎస్సార్‌ హయాంలోనే 72 టీఎంసీలకు సోమశిల చేరింది.