CM Jagan on Volunteer System: వాలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారు, వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది

CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

Guntur, Feb 15: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభను (Appreciation meeting of volunteers)ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచిన సంగతి విదితమే.

ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించింది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ.45 వేలు చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించారు. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచింది.

టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా, విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమని మండిపాటు

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ (CM Jagan on Volunteer System) మాట్లాడుతూ, మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని.. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు.

‘‘ఇంటింటి ఆర్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని సురక్ష ప్రవేశపెట్టాం. గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాలిందే. గత ప్రతీ పనికి కార్యాలయా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ అందిస్తున్నారు. కులం,మతం , ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. గడప గడపకు వెళ్లి పెన్షన్‌ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు’’ అని సీఎం (CM Jagan Mohan Reddy ) చెప్పారు.

మట్టిలోని మాణిక్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఆడుదాం ఆంధ్రా లక్ష్యం, ముగింపు వేడుకల్లో ప్రసంగించిన సీఎం జగన్

వాలంటీర్లు నా సైన్యం.. పేదలకు సేవ చేసే వాలంటీర్లే.. రేపు కాబోయే లీడర్లు.చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్ల సేవలకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నా. ఇవాళ్టి నుంచి వారంపాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం. పేదవాళ్లకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదు.

875 మంది వాలంటీర్లకు సేవావజ్రా అవార్డులు. 4,150 మంది సేవారత్న అవార్డులతో గౌరవం. 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులతో సన్మానం. 2,55,464 మంది వాలంటీర్లకు అభివందనలతో నగదు బహుమతి. లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్ల బద్దలు కొట్టారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.