YS Jagan on Door to Door Campaign: వైసీపీ నేతలకు భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన సీఎం జగన్, ఈ సారి 175 సీట్లు గెలవాలి, గడప గడపకు కార్యక్రమంలో వర్క్ షాప్ లో కీలక కామెంట్లు, పలువురు సీనియర్ నేతలకు క్లాసు పీకిన జగన్, ఐప్యాక్ టీమ్‌తో ప్రత్యేక నిఘా
జగన్ (CM Jagan) మరో అడుగు ముందుకేశారు. క్లీన్ స్వీప్ పై కన్నేసిన జగన్.. పార్టీ నేతలకు బిగ్ టార్గెట్ ఫిక్స్ (Big Target) చేశారు. మిషన్ 2024, టార్గెట్ 175 అంటున్నారు జగన్. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందే అంటున్నారు జగన్. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని, ఈసారి 175 సీట్లను సాధించేలా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారాయన.
Vijayawada, June 09: ఏపీలో ఎన్నికలకు (AP Elections) ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, అప్పుడే ఎన్నికల (Elections) కోలాహలం కనిపిస్తోంది. ప్రతిపక్షాలు సహా అధికార పక్షం సైతం ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది. వైసీపీ(YCP), టీడీపీ(TDP), జనసేన, బీజేపీ.. అన్ని పార్టీలు.. టార్గెట్ 2024 అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే పొత్తుల గురించి రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ (CM Jagan) మరో అడుగు ముందుకేశారు. క్లీన్ స్వీప్ పై కన్నేసిన జగన్.. పార్టీ నేతలకు బిగ్ టార్గెట్ ఫిక్స్ (Big Target) చేశారు. మిషన్ 2024, టార్గెట్ 175 అంటున్నారు జగన్. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందే అంటున్నారు జగన్. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని, ఈసారి 175 సీట్లను సాధించేలా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారాయన. ఇదే మన లక్ష్యం అన్న జగన్.. దాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ (Gadapa gadapa ku Mana Prabhutavam) కార్యక్రమంపై వర్క్ షాప్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకు (YCP MLA's) దిశానిర్దేశం చేశారు. వారికి భారీ టార్గెట్ ఫిక్స్ చేశారు.
కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. ప్రజల్లో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నామని వైసీపీ నేతలతో చెప్పారు జగన్. కుప్పం (Kuppam)మున్సిపాలిటీలో గెలుస్తామని ఊహించారా అని ప్రశ్నించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని అనుకోలేదన్నారు. కానీ గెలిచి చూపించామన్నారు. అలాగే 175 సీట్లకు 175 సీట్లు సాధించగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు జగన్. ఇది జరగాలంటే నేతలంతా కష్టపడి పని చేయాలన్నారు. రాష్ట్రంలో 86శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పటికే అందాయన్న జగన్.. చరిత్రలో ఇప్పటికే మనం చెరగని ముద్ర వేశామన్నారు. అంతేకాకుండా ప్రజలకు మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామన్నారు. ఇక ఇప్పుడు మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే అని జగన్ అన్నారు.
గడప గడపకు (gadapa gadapa ku) కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం, ఎలా చేస్తున్నాం, ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి, ఎలా సమర్థత పెంచుకోవాలి అన్న దానిపై నిరంతరంగా చర్చించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు జగన్. దీని కోసం నెలకొకసారైనా వర్క్ షాప్ (Work Shop) నిర్వహించాలన్నారు. ఆ నెల రోజుల్లో చేపట్టిన కార్యక్రమం గురించి మనకొచ్చిన ఫీడ్ బ్యాక్ పై చర్చించాలన్నారు. ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై వర్క్ షాప్ లో దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు జగన్.
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్.. ఈ కార్యక్రమాన్ని లైట్ గా తీసుకున్న ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎలా పాల్గొంటున్నారన్న దానిపై ఐ-ప్యాక్ టీమ్ (I PAC Team) జగన్ కు నివేదిక ఇచ్చింది. ఎమ్మెల్యే ఎన్ని రోజులు కార్యక్రమంలో పాల్గొన్నారు, వారి పనితీరు అంశాలపై ప్రజంటేషన్ ఇచ్చింది ఐప్యాక్ టీమ్.
మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని గుర్తించారు. ఆళ్ల నాని, వసంత కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ (Bosta satyanarayana), రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు అసలు ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోలేదు. వీరిలో మంత్రి బొత్సకు సీఎం జగన్ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తొలి నెల కాబట్టి ఈసారికి వదిలేస్తున్నానని ఇకపై మాత్రం ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు సీఎం జగన్. ప్రతి నెల సమీక్ష చేస్తానన్నారు. 6 నెలల తర్వాత నివేదికను బట్టి చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు జగన్. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. మొత్తంగా.. మార్పు రాకపోతే ఆరు నెలల తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించారు జగన్.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)