CM Jagan in Action: సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ కీలక నిర్ణయం, కొత్తగా 809 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో..

ఈ సమావేశంలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, సమీక్ష సందర్భంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

CM-YS-jagan-Review-Meeting

Amaravti, Oct 28: వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, సమీక్ష సందర్భంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీతో అందించనున్నట్టు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు.. ఆరోగ్య శ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. ఎక్కడా కూడా బకాయిలు లేకుండా చూస్తున్నాం. ఎంపానెల్డ్‌ ఆసుపత్రుల్లో నమ్మకం, విశ్వాసం కలిగింది. రోగులకు మరిన్ని వైద్య సేవలను ఇప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. 104 కాల్‌ సెంటర్‌ ద్వారా ఆరోగ్యశ్రీ రిఫరల్‌ సర్వీసులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.

టీడీపీ నేత వర్ల రామయ్య భార్యకు రైతు భరోసా, ధ్రువీకరణ పత్రం అందజేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తామని వెల్లడి

ఆరోగ్య శ్రీ కింద అందుతున్న సేవలపై ఎంపానల్డ్, విలేజ్‌ క్లినిక్స్‌, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఉంచుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారంతో బుక్‌లెట్స్‌ కూడా ఇస్తున్నామన్నారు. ఆసుపత్రుల వివరాలు, అందుతున్న సర్వీసుల వివరాలు కూడా ఇందులో ఉంచుతున్నామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు. కాగా, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవా అవార్డులు అందించనున్నట్టు తెలిపారు.

ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలు..

- మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల సంఖ్య 1059 కాగా.. జనవరి 2020లో 2059కి పెంచుతూ వైఎస్సాఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్యం ఖర్చు వేయి రూపాయల ఖర్చుకు పైబడ్డ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు.

- జులై 2020లో 2200కు పెంచుతూ నిర్ణయం. ఈ సందర్భంగా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్‌ చికిత్స ప్రొసీజర్లను చేర్చారు.

- నవంబర్‌ 2020లో 2436 పెంపు. బోన్‌ మ్యారోతోపాటు 235 ప్రొసీజర్ల చేరిక.

- మే-జూన్‌ 2021లో 2446కు ఆరోగ్యశ్రీ చికిత్సల పెంపు. 10 కోవిడ్‌ ప్రొసీజర్ల చేరిక.

- 2022లో 3255కు పెంచుతూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.