YS Sharmila: ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర పోస్టు, శుభాకంక్ష‌లు చెప్తూ బ‌హిరంగ లేఖ రాసిన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు

సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ జగన్‌ (YS Jagan) కు స్వయాన సోదరైన వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అన్నకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు.

YS Sharmila Meets Chandrababu

Vijayawada, June 12: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు (Chandra Babu)కు ఏపీ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) విడుదల చేసిన లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా ప్రమాణం చేసిన పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కు , కూటమిలోని మంత్రులకు ఆమె శుభాకాంక్షలు (congratulation) తెలిపారు. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలని సూచించారు.

 

ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ జగన్‌ (YS Jagan) కు స్వయాన సోదరైన వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అన్నకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు.

ముఖ్యంగా చిన్నాన్న వైఎస్‌ వివేకానందా హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కడప నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి (YSRCP) మరోసారి పోటి చేసి విజయం సాధించారు.